‘బాలయ్య’ సినిమాపై ట్వీట్ చేసిన ‘మెగా హీరో’

Sai-Dharam-Tej-tweets-on-Gautamiputra-Satakarni.jpgఈ సంక్రాంతికి ‘మెగా’ వర్సెస్ ‘నందమూరి’ ఎపిసోడ్ ఎంత రసవత్తరంగా సాగిందో తెలిసిన విషయమే. రెండు ప్రతిష్టాత్మక సినిమాలే కావడంతో అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూడగా, మెగా అభిమానులంతా ఇప్పటికే ‘ఖైదీ నంబర్ 150’ సినిమాకు పట్టం కట్టారు. తొలిరోజు ‘బాహుబలి’ రికార్డులకు ఎసరు పెట్టే విధంగా ఉన్న ట్రేడ్ రిపోర్ట్ తో మెగాస్టార్ ఒడ్డున పడ్డట్లే భావిస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇక అందరి చూపులు నందమూరి నటసింహం నటించిన 100వ సినిమా వైపుకు మళ్ళాయి.

క్రిష్ దర్శకత్వంలో రూపొందిన “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చేసింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాపై మెగా హీరో ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్, నందమూరి సినిమాపై ట్వీట్ చేయడంతో అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గురించి గ్రేట్ రిపోర్ట్స్ వింటున్నానని, చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ మెగాహీరో.

ADVERTISEMENT

“మాలో చాలా మందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు” అంటూ సాయిధరమ్ తేజ్ చేసిన ట్వీట్ తో, ఈ మెగా హీరో వ్యక్తిత్వం ఏమిటో మరోసారి బయటపడింది. మెగా ఇంట పుట్టినా, చాలా కష్టాలు పడి హీరో అయిన సాయిధరమ్ తేజ్ గురించి ఇండస్ట్రీలో చాలా పాజిటివ్ బజ్ ఉంది. అయితే ఎందుకు అంతలా సాయిని అభిమానిస్తారో ఇలాంటి సంఘటనలు చెప్తాయి.

ADVERTISEMENT
Latest Stories