పాత పాత్రలతో కొత్తగా ట్రై చేస్తుందా?

Sai Pallavi - Padi Padi -Leche Manasuసినిమా పాత్రలు రాయడంలో కొత్త కొత్త దర్శకులు కొత్త పంధాను విడిచి పాత పంధానే ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారా? అంటే అవును అనే చెప్పాలి. అయితే ఇది కూడా ఒక పాతదైన కొత్త ట్రెండే అని చెప్పవచ్చు. ఎలా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలో హీరోయిన్ పాత్రలకు పెద్దగా హడావిడి ఏమీ ఉండదు…ఒక రెండు లవ్ సీన్లు, నాలుగు పాటలు అంతే…

[m9ad]

ADVERTISEMENT

అయితే యువ హీరోయిన్స్ లో ఒకరైన సాయి పల్లవి కోసం మాత్రం పాత పాత్రలే కొత్త కొత్త పుట్టుకు వస్తున్నాయి. ఇప్పటికే ఫిదాతో అందరినీ ఫిదా చేసిన ఈ భామ, ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా అందరినీ ఫిదా చేసే పాత్రలే ఎక్కువగా ఎంచుకుంది. ఇక తాజాగా పడి పడి లేచే మనసు సినిమాలో ఆమె పాత్ర ఫుల్ మైలేజ్ ఇచ్చే పాత్రేనట. ఇదిలా ఉంటే టాలీవుడ్ సర్కిల్స్ కధనం ప్రకారం ఈ భామ కోసం నక్సలైట్ పాత్ర ఒకటి రూపు దిద్దుకుంటుంది అని, ఆ పాత్రను ‘నీది నాది ఒకే కధ’ సినిమా దర్శకుడు వేణు ఉడుగుల ‘విరాట పర్వం 1992’ సినిమా కోసం తయారు చేశాడు అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో రాణా దగ్గుపాటి హీరో కాగా. ఆయన పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు…మరో పక్క అతన్ని ప్రేమించే నక్సలైట్ పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. భహుశా అప్పట్లో రాములమ్మగా అలరించిన విజయశాంతిని ఆదర్శంగా ఈ పాత్రను తెరకెక్కించి ఉంటాడు దర్శకుడు. మరి ఈ పాత్రలో సాయి పల్లవి ఎలా అలరిస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories