పొరుగు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను చూసి వైసీపిలో నిప్పు అంటించుకుని మంటలు ఆర్పుకునేందుకు జగన్ తిప్పలు పడుతున్నా, వైసీపి ప్రగల్భాలు ఏమాత్రం తగ్గలేదు.
ఆయనను ప్రసన్నం చేసుకొని టికెట్స్ దక్కించుకునేందుకు పార్టీ నేతలు చంద్రబాబు, పవన్‌లను అవహేళన చేస్తుంటే, ఓటమి భయంతో ఆందోళన చెందుతున్న జగన్మోహన్ రెడ్డికి ఉపశమనం కలిగించేందుకు ఆయన ఆత్మసాక్షి కూడా ఉడతాభక్తిగా ప్రయత్నిస్తూనే ఉంది.
ఈరోజు (జనవరి 13) ఆన్‌లైన్ సంచికలో “చంద్రబాబు తప్పించుకోలేరు.. ‘యావజ్జీవం’ తప్పదు” అంటూ పెద్ద కధనం ప్రచురించి అధినేతకు నైవేధ్యంగా సమర్పించుకుంది.
దానిలో చంద్రబాబు నాయుడుపై జగన్ ప్రభుత్వం నమోదు చేయించిన కేసులు, వాటి సెక్షన్స్ జాబితాలను పేర్కొని, ఈ కేసుల నుంచి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితులలో తప్పించుకోలేరు. నేడు కాకపోతే రేపైనా చంద్రబాబు నాయుడు మళ్ళీ జైలుకి వెళ్ళకతప్పదు. ఈ కేసులలో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ శేష జీవితం జైల్లోనే గడపక తప్పదు,” అంటూ ఆత్మసాక్షి తీర్పు చెప్పేసింది.
చంద్రబాబు నాయుడు అదృష్టం ఏమిటంటే ఆయనకు మరణ శిక్ష విధించబోతున్నట్లు తీర్పు చెప్పలేదు. అవకాశం ఉంటే అదీ విధించేసి ఉండేదేనేమో?
జగన్‌కు ఊరట కలిగించడానికో లేదా చంద్రబాబు నాయుడుకి ఏదో జరిగిపోబోతోందని టిడిపిని భయపెట్టేందుకో చేతిలో మీడియా ఉంది కనుక ఇలా ఎన్ని పేజీలైనా వ్రాసుకోవచ్చు. అయితే ‘అదో తుత్తి’ మాత్రమే. నిజం చెప్పాలంటే ఇది జగన్మోహన్ రెడ్డికి శల్యసారధ్యం చేయడమే.
వైసీపీ పాలనలో అరాచకాలు, అనాలోచిత విధానాలు, నిర్ణయాలు, ముఖ్యంగా అమరావతి- విశాఖ రాజధాని విషయంలో చేతులు ఎత్తేయడం, అప్పులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులలో పెరిగిన అసంతృప్తి కఅంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్య కార్మికుల ఆందోళనలు ళ్ళకు కనబడుతూనే ఉన్నాయి.
చంద్రబాబు అరెస్టుతో టిడిపి పట్ల పెరిగిన సానుభూతీ, టిడిపి, జనసేనల పొత్తులు, వైఎస్ షర్మిల ఎంట్రీ, తాజాగా పార్టీ అభ్యర్ధులలో మార్పులు చేర్పుల వలన పార్టీలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు వైసీపికి ప్రమాద ఘంటికలే.
కనుక వైసీపి ఎంత ప్రమాదకర పరిస్థితులలో ఉందో అధినేతకు తెలియజేసి అప్రమత్తం చేయాల్సి ఉండగా, చంద్రబాబుకు యావజ్జీవం తప్పదంటూ కధనాలు ప్రచురిస్తూ జగన్మోహన్ రెడ్డిని తప్పు దోవ పట్టిస్తున్నట్లు చెప్పవచ్చు.
వైసీపి నుంచి ఫీజు తీసుకుంటున్నందుకు ఐ-ప్యాక్ జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికప్పుడు ఈ పరిస్థితుల గురించి హెచ్చరిస్తూనే ఉంది. కానీ వైసీపికి, జగన్‌కు ఆత్మసాక్షి మాత్రం ఆయనకు శల్యసారధ్యం చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది.
ఒకవేళ శాసనసభ ఎన్నికలలో వైసీపి ఓడిపోతే అప్పుడు తాపీగా పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటున్నప్పుడు మన ఆత్మసాక్షి కూడా ఒకటి అని చెప్పుకుని బాధపడతారేమో?




