నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం నాలుగేళ్ళ కోసారి భార్యలను మార్చడం మగతనమా అంటూ తీవ్ర పదజాలంతో పవన్ పై నిప్పులు చెరిగారు. జగన్ దాడిని సాక్షి కొనసాగిస్తోంది. జనసేనానికి వ్యతిరేకంగా ఒక కథనాన్ని వండి వార్చారు. నిన్న అనంతపురం పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నారాయణపురం రైతులతో ముఖాముఖిలో పాల్గొనాల్సి ఉండగా సాయంత్రం 4.45 గంటలకు ఓ చీనీ తోటలోకి వెళ్లారట.
[m9ad]
ఇంతలో పొలంలో దుమ్ము లేవడంతో వేగంగా అడుగులేస్తూ వచ్చి తిరిగి కారులో కూర్చుని, చేతులతో తల కొట్టుకొంటూ పవన్ కల్యాణ్ అసహనం ప్రదర్శించారట. ఎంతసేపటికీ పవన్ కల్యాణ్ ముఖాముఖి వేదిక వద్దకు రాకపోవడంతో విసుగు చెందిన రైతులు, గ్రామస్తులు ఆరా తీయగా దుమ్ము రేగుతోందని పవన్ వెళ్లిపోయారని తెలియడంతో అంతా నిష్టూరమాడుతూ వెనుదిరిగారని, ‘దుమ్ము భరించలేనోడు ఏం నాయకుడు..? ఎలా రాజకీయం చేస్తారు..?’ అంటూ చర్చించుకున్నారని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.
గత కొద్ది రోజులుగా జగన్ పై విమర్శల దాడి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. దీనిపై జగన్ నిన్న గట్టిగానే స్పందించారు. తమ యజమాని నుండి అందుకుని సాక్షి కూడా పవన్ కళ్యాణ్ పై ముప్పేట దాడికి దిగుతుంది. రానున్న రోజులలో ఈ దాడి మరింత ఉదృతం చేయబోతుంది. దీనికి పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. వీరి సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వాన్ని వదిలేసి ప్రతిపక్షం తనలో తాను కొట్టుకుంటే అది అధికార పార్టీకి ఆనందం కలిగించేదే. దానిని వీరు ఎంత త్వరగా తెలుసుకుంటే వారికే మంచిది. .



