ఎవరు చైతన్య, ఎవరు నాగ్ అని సమంతకు తెలియడంలేదట!

Samantha akkineni about Nagarjuna Akkineniకింగ్ నాగార్జున ఆయన కోడలు సమంత కలిసి నటించిన రాజు గారి గది-2 రిలీస్ అయ్యీ మంచి టాక్ తెచ్చుకుంది. మామకోడళ్లు కలిసి సినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. ఒకానొక ఇంటర్‌వ్యూలో ‘మన్మథుడు’కి మీసం ఉంటేనే అమ్మాయిలు ఇంకా ఇష్టపడుతారని అన్నారు.

ADVERTISEMENT

దీనికి నాగార్జున కలిపించుకుని చాలా మంది అమ్మాయిలు బాగున్నానని అంటున్నారని తెలిపారు. వెంటనే కోడలు సమంత కల్పించుకుని, “చీకట్లో ఎవరు చైతన్య, ఎవరు నాగార్జున అని ఎవరికీ తెలియడం లేదు. ప్రతి ఒక్కరు ఆయన (నాగ్‌) దగ్గరికి వెళ్లి.. చూశాక హో.. క్షమించండి సర్‌ అని అంటున్నారు. మీసాలు లేకుంటే వాళ్లిద్దరు ఒకేలా ఉన్నారు,” నవ్వుతూ చెప్పారు.

నాగ చైతన్యతో పెళ్ళైన కొద్దిరోజుల తరువాతే ఈ సినిమా రిలీస్ కావడంతో కాళ్ళ పారాణీ అరాకముందే సమంత టీవీ స్టూడియోల చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. ఈ చిత్రంలో సమంత ‘అమృత’ అనే పాత్రలో ఆత్మగా కనిపించారు. నాగార్జున రుద్ర అనే మెంటలిస్ట్ పాత్రలో యాక్ట్ చేసి మెప్పించారు.

ADVERTISEMENT
Latest Stories