దక్షిణాది చిత్ర పరిశ్రమకు సమంత దండాలు!

samantha-ruth-prabhu-comments-on-south-india-film-industry‘ఏం మాయ చేసావే’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సమంతకు ప్రేక్షకులు నీరాజనం పలికిన విషయం తెలిసిందే. అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలందరి సరసన నటించిన ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకున్న సమంత, తెలుగులోనే కాక తమిళంలో కూడా పలు పెద్ద సినిమాలలో నటించింది. సూర్య, విజయ్ వంటి స్టార్ హీరోలతో నటించిన సమంత, ఒక్కసారిగా దక్షిణాది చిత్ర పరిశ్రమకు ‘దండాలు’ పెట్టేసింది. ఈ దిశగా ట్విట్టర్ వేదికగా సమంత చేసిన ట్వీట్లు సంచలనం సృష్టిస్తున్నాయి.

ADVERTISEMENT

“దక్షిణాదిలో ఒక హీరోయిన్ కు అర్ధవంతమైన పాత్ర దొరకడం ఎంత కష్టమో తెలుసుకున్నానని, అందుకే నేను కొత్త సినిమాలను అంగీకరించలేక పోతున్నానని, సరైన పాత్రలు లేకపోవడమే ఒకే ఒక్క కారణమని, ఇది చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నానని” సమంత ట్వీట్లు చేసుకొచ్చింది. అయితే ఇప్పటివరకు కేవలం దక్షిణాదిలో మాత్రమే సినిమాలు చేసిన సమంత, చివరకు అదే సినీ పరిశ్రమను వేలెత్తి చూపించడం ఏంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

త్వరలో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకోబోతున్న సమంత, ఆ తర్వాత సినిమాలకు దూరం కావడం తధ్యమన్న వార్తలు ఇటీవల హల్చల్ చేసాయి. అయితే పెళ్లిని సాకుగా చూపకుండా, తనకు సరైన పాత్రలు కారణంగా చూపడాన్ని సినీ జనాలు తప్పు పడుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి రోల్స్ అయితే సమంతకు వచ్చాయో, దాదాపుగా అలాంటి పాత్రలే వస్తాయి తప్ప, ‘అరుంధతి’లో అనుష్క లాగానో, ‘బాహుబలి’లో అనుష్క మాదిరో కావాలంటే సమంతకు కష్టమే కదా!

ADVERTISEMENT
Latest Stories