‘స్పై’ కెమెరాల కాంపెయిన్ లో సమంత, మెహ్రీన్!

Samantha,-Mehreen-Kaur-Pirzada-on-SPY-cameras‘స్పై కెమెరాలు’ మహిళల జీవితంలో ఎంతటి ప్రభావితాన్ని చూపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీలకైతే కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. అప్పట్లో హీరోయిన్ త్రిష ఉదంతం కలకలం రేపగా, ఆ తర్వాత హీరోయిన్లు వ్యక్తిగతంగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ స్పై కెమెరాల నియంత్రణపై హెవెన్ హోమ్స్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం కూడా జరిగింది.

స్పై కెమెరాలు మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని… ఈ కెమెరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఈ రహస్య కెమెరాలు ఆన్ లైన్ లో కేవలం 250కే లభిస్తున్నాయని… దీంతో, ఎంతో మంది వీటిని సొంతం చేసుకుంటున్నారని నటి సనా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో చేపడుతున్న మిస్ట్ కాల్ (8099259925) క్యాంపెయిన్ బ్రోచర్ ను సనా ఆవిష్కరించారు.

ADVERTISEMENT

రహస్య కెమెరాల వల్ల కలుగుతున్న అనర్థాల పట్ల నటీమణులు సమంత, మెహ్రీన్ లు కూడా ఎంతో ఆవేదన చెందారని, వీరిద్దరూ కూడా ఈ ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్ లో భాగస్వాములయ్యారని చెప్పారు. టూత్ బ్రష్, షాంపు బాటిల్స్ లో కూడా చాలా సులువుగా స్పై కెమెరాలు పెట్టేస్తున్నారని అన్నారు. ఈ కెమెరాలను దుర్వినియోగం చేస్తూ మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారని, తుపాకులకు లైసెన్సులు ఇస్తున్నట్టుగానే… ఈ కెమెరాలకు కూడా లైసెన్స్ లు తప్పనిసరి చేయాలని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories