ఆఫ్ ది స్క్రీన్ లో ప్రిన్స్ మహేష్ బాబు కుండే ‘సెన్సాఫ్ హ్యుమర్’ గురించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు చెప్పగా, తాజాగా ఆ జాబితాలోకి దర్శకుడు మురుగదాస్ కూడా చేరిపోయారు. ఆఫ్ ది స్క్రీన్ లో మహేష్ కు భయంకరమైన ‘సెన్సాఫ్ హ్యుమర్’ ప్రదర్శిస్తాడని, అది ఒకటి, రెండు గంటలైనా అలా నవ్వుతూ ఉండిపోవాల్సిందేనని చెన్నై ఆడియో వేడుకపై మురుగదాస్ తన భావాలను పంచుకున్నారు. అయితే ఇదే వేదికపై మహేష్ సెన్సాఫ్ హ్యుమర్ రేంజ్ ఏమిటో మరోసారి బయటపడింది.
ఈ ఆడియో వేడుకను కమెడియన్ సంతానం మరియు గాయని చిన్మయి హోస్ట్ చేసారు. మహేష్ ప్రసంగించిన సమయంలో మీకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాం అంటూ… చిన్మయి మాట్లాడగా, “మీరు హోస్ట్ చేస్తున్నారు అని చెప్పగానే, సడెన్ గా సమంత ఈ ఈవెంట్ లో ఉన్నట్లుగా అనిపించింది” అని చెప్పగానే అక్కడున్న వారంతా నవ్వేసారు. మహేష్ చేసిన ఈ వ్యాఖ్యలనే ఓ ఇమేజ్ రూపంలో ట్విట్టర్ లో సమంతకు పోస్ట్ చేయగా, దానిపై సమంత స్పందించిన వైనం వైరల్ అవుతోంది.
మహేష్ చేసిన వ్యాఖ్యలకు ‘కన్నీళ్ళ’తో కూడిన మూడు ఏమోజీలను రిప్లైగా పోస్ట్ చేసి తన భావం ఏమిటో చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో తన హస్కీ వాయిస్ తో సమంతకు డబ్బింగ్ అంటే చిన్మయినే అనేటంతగా మారిపోయిన విషయం తెలిసిందే. దీనినే ప్రిన్స్ అటు సమంతకు, ఇటు చిన్మయికి కౌంటర్ వేసాడు. మహేష్ సెన్సాఫ్ హ్యుమర్ కు సమంతకు ఆనందభాష్పాలు రాక తప్పలేదు. గతంలో చాలా సందర్భాలలో సమంత కూడా ప్రిన్స్ సెన్సాఫ్ హ్యుమర్ గురించి గొప్పగా చెప్పుకొచ్చిన వైనం తెలిసిందే.


