సమంత ఆనందం నిముషాలలో ఆవిరి

Samantha Happieness evaporates in minutesసమంత అక్కినేని నటిస్తున్న మొదటి ఓటీటీ ప్రాజెక్ట్… ది ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ ఈరోజు ఉదయం రిలీజ్ అయ్యింది. ఎల్టీటీఈ రెబెల్ గా సమంత ఈ సిరీస్ లో కనిపించనుంది. ఒక సూసైడ్ మిషన్ కోసం రెడీ అయిన ఆమెను శ్రీకాంత్ తివారి టీమ్ ఎలా నిలువరించింది అనేది అసలు స్టోరీ. ఇక లుక్, పెర్ఫార్మన్స్ పరంగా సమంత ఇరగదీసింది.

ఒక గ్లామర్ హీరోయిన్ ఛాయలు ఏ మాత్రం లేకుండా నిజంగా ఒక టెర్రరిస్ట్ లాగా పూర్తిగా డి-గ్లామ్ లుక్ లో సన్నటి శరీర సౌష్టవంతో ఇరగదీసింది. కొన్ని ఎక్స్ప్రెషన్లకు, ఆమె చేసిన స్టంట్లకు ఫిదా కావాల్సిందే. సోషల్ మీడియాలో ఆమె మీద పొగడ్తల వర్షం కురుస్తుంది. అయితే ఇటువంటి సమయంలో ఆమె ఒక వివాదంలో ఇరుక్కుంది.

ADVERTISEMENT

ఎల్టీటీఈ అనేది శ్రీలంకలో తమిళులు చేసిన పోరాటం… దానికి వ్యతిరేకంగా తీస్తున్న సిరీస్ అని… తమిళ తంబీలు ఈ వెబ్ సిరీస్ కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ది ఫ్యామిలీ మాన్ 2 ని బహిష్కరించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా సమంత సినిమాలు కూడా బ్యాన్ చెయ్యాలని కూడా అంటున్నారు.

#FamilyMan2_against_Tamils అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం తమిళ్ లో సమంతకు సంబంధించిన రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ దశలో ఈ వివాదం ఎటు దరి తీస్తుందో చూడాలి. అయితే ప్రస్తుతానికి ఈ వివాదం మాత్రం ది ఫ్యామిలీ మాన్ 2 కు పబ్లిసిటీ తెచ్చి పెట్టేదే అని మాత్రం చెప్పుకొచ్చు. జూన్ 4న ది ఫ్యామిలీ మ్యాన్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories