సమంత మొదటిసారి బయటపడింది!

2 States Telugu Remake, 2 States Telugu Remake Samantha Naga Chaitanya, 2 States Samantha Naga Chaitanya Real Love Story, 2 States Telugu Remake Detailsఅక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న “ప్రేమమ్” సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. చైతూ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు భావిస్తున్న ఈ సినిమాకు ‘కుందనపు బొమ్మ’ శుభాకాంక్షలు చెప్పింది. తమ ప్రేమ విషయం బహిరంగం కావడంతో… ఇక అంతా పబ్లిక్ గా చెప్పుకునే సౌలభ్యం వీరిద్దరికీ లభించినట్లయ్యింది. దీంతో ట్విట్టర్ వేదికగా తన ప్రేమికుడు చైతూ నటించిన సినిమా “ప్రేమమ్”కు సమంత ‘ఆల్ ది బెస్ట్’ చెప్తూ ట్వీట్ చేసింది.

అంతేకాదు, ఈ సినిమా బాగుంటుందన్న విషయం తనకు తెలుసని చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలో సహజంగా ఉండే సెంటిమెంట్లలో ప్రేమ, పెళ్లి కూడా ఉన్నాయి. ఆయా హీరోలకు పెళ్ళయిన తర్వాత వారి కెరీర్ లు ఎలా మారిపోయాయో అంటూ విశ్లేషణలు చేస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత మహేష్ కెరీర్ ఓ రేంజ్ లో మారిపోయిందని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కూడా ఇంకో విధంగా మారిందని… ఇలా సెంటిమెంట్లు జోడిస్తూ ఉంటారు.

ADVERTISEMENT

మరి సమంత – చైతూల ప్రేమ బయటపడిన తర్వాత విడుదల అవుతోన్న మొదటి సినిమా కావడంతో… చైతూ కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో అంటూ సినీ జనాలు వేచిచూస్తున్నారు. అభిమానులు మాత్రం ‘కెవ్వు కేక’ అనే రేంజ్ లో ఉంటుందంటున్నారు. మరికొద్ది గంటల్లో ‘రిజల్ట్’ను డిక్లేర్ చేయనున్నారు ప్రేక్షక దేవుళ్ళు!

ADVERTISEMENT
Latest Stories