అయ్యో… ‘వరల్డ్ కప్’ విన్నర్ ఇలా అయిపోయాడేంటి..!

Sanath Jayasuriya Unable to Walk Without Crutchesసనత్ జయసూర్య… క్రికెట్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. 1996లో శ్రీలంక జట్టు తరపున ఓపెనర్ గా బరిలోకి దిగి, ప్రపంచ కప్ ను అందించిన ఘనతను సొంతం చేసుకున్న సనత్ జయసూర్య, ఇటీవల కాలంలో క్రికెట్ వేడుకలపై కనిపించింది లేదు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొంతకాలం కామెంటరీలు చెప్పిన సనత్, ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. మరి అలాంటి సనత్ జయసూర్య ప్రస్తుతం ఎలా ఉన్నారో చూస్తే షాకింగ్ కు గురి కాకుండా ఉండలేరు.

ADVERTISEMENT

అవును… 90వ దశాకలల్లో బౌలర్లను బెంబేలెత్తించిన జయసూర్య, ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నారు. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం స్టేచర్ లేనిదే సనత్ అడుగు వేసే పరిస్థితి లేదు. ఇందు నిమిత్తం త్వరలో ఆస్ట్రేలియా కూడా వెళ్లనున్నాడు. మెల్ బోర్న్ లో తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోబోతున్న జయసూర్య, పూర్తి కోలుకోవడానికి మరో నెల రోజుల సమయం అయినా పడుతుందని సమాచారం. అయితే ఇలా స్టేచర్ పట్టుకుని నడుస్తున్న జయసూర్యను అభిమానులు చూడలేకపోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories