ఏంటి ఈ అరాచకం… సప్తగిరి డైలాగ్ కు పిచ్చెక్కిపోతోంది..!

Saptagiri Express Motion Poster Talkఅక్కా… అక్కా… అంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రలో “సప్తగిరి ఎక్స్ ప్రెస్” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆడియో విడుదల జరగనున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ డైలాగ్ టీజర్ ను విడుదల చేసారు. సప్తగిరి నుండి ఎవరూ ఎపుడూ ఊహించని విధంగా ఈ డైలాగ్ టీజర్ ఉంటుందని చెప్పడంలో సందేహమే లేదు.

పరశురాముడు గెటప్ లో సప్తగిరి చెప్పిన డైలాగ్ ను మాస్ భాషలో వర్ణించాలంటే… అరాచకం అని చెప్పాలి. పౌరాణిక డైలాగ్ లను సప్తగిరి ఇంత అద్భుతంగా పలకగలరని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. దానికి తగిన విధంగానే బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆ సన్నివేశాన్ని బాగా ఎలివేట్ చేసింది. చూడబోతుంటే… “సప్తగిరి ఎక్స్ ప్రెస్” ద్వారా గట్టి షాకే ఇవ్వడానికి సప్తగిరి సిద్ధమైనట్లుగా కనపడుతోంది.

ADVERTISEMENT

సప్తగిరి ఫ్యాన్స్ అయితే ఈ డైలాగ్ టీజర్ ను రిపీట్ మోడ్ లో కనీసం ఓ రెండు, మూడు సార్లు తిలకించడం ఖాయం. మరి మీరు మన సప్తగిరి ఎక్స్ ప్రెస్ లో వింతలను వీక్షించండి..!

ADVERTISEMENT
Latest Stories