2022 జనవరి నుండి మొదలు!

Sarkaru Vaari Paata _ Mahesh Babu“సర్కార్ వారి పాట” అప్ డేట్స్ ఇవ్వడం లేదంటూ గతంలో మైత్రీ మూవీ మేకర్స్ ను అనేక సందర్భాలలో సోషల్ మీడియాలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ట్రోల్ చేసారు. ప్రస్తుతం “పుష్ప” సినిమాను ప్రమోట్ చేస్తూ కలెక్షన్ అప్ డేట్స్ ఇచ్చే పనిలో ఉన్నారు. అలాగే ‘పుష్ప’ సినిమా టైంకు వచ్చేలా సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్తున్నారు.

ADVERTISEMENT

ఈ క్రమంలో ఓ అభిమాని ‘సర్కార్ వారి పాట’ అప్ డేట్స్ ఇవ్వండి స్వామి, అని చేసిన ట్వీట్ కు ‘జనవరి 2022 నుండి మొదలు’ అని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుండి రిప్లై వచ్చింది. ఊహించని రిప్లైతో ఉబ్బితబ్బిబ్బైపోవడం సదరు అభిమాని వంతు అయితే, తమకు కావాల్సిన సమాధానం లభించిన తర్వాత కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ట్రోల్ కొనసాగింది.

అప్ డేట్ అంటే… మళ్ళీ వాయిదా అప్ డేట్ ఇవ్వొద్దు అంటూ చిత్ర నిర్మాణ సంస్థను టార్గెట్ చేస్తున్నారు. అసలే ‘భీమ్లా నాయక్’ పోస్ట్ పోన్ కావడం అనివార్యం కావడంతో, పవన్ సినిమా ఎప్పుడు రానుందో ఇంకా స్పష్టత రాలేదు. ఫిబ్రవరి అని ప్రస్తుతం టాక్ వినపడుతున్నప్పటికీ నిర్మాత ఖరారు చేయలేదు. ఒకవేళ పవన్ ఫిబ్రవరిలో వస్తే ‘ఆచార్య’ విడుదలపై సందేహాలు నెలకొంటాయి.

ఇలా ఒక సినిమా ప్రభావం మరో సినిమా రిలీజ్ పై పడితే, మళ్ళీ ‘సర్కార్ వారి పాట’ను మాత్రం వాయిదా వేయొద్దు అని సూపర్ స్టార్ అభిమానుల మాట. ఏప్రిల్ 1వ తేదీన పాట గంట మోగాల్సిందేనని కంకణం కట్టుకుని కూర్చున్నారు. గతంలో థమన్ ఇచ్చిన సమాచారం మేరకు సంక్రాంతికి ‘సర్కార్ వారి పాట’ నుండి మొదటి లిరికల్ సాంగ్ విడుదల కానుంది.

ADVERTISEMENT
Latest Stories