‘కిల్లర్’ ఫస్ట్ లుక్ ఇది..!

Savyasachi First Look Postersనాగచైతన్య హీరోగా నటిస్తోన్న “సవ్యసాచి” ఫస్ట్ లుక్ వచ్చేసింది. ‘కార్తీకేయ’ ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నెటిజన్లను ఫిదా చేస్తోంది. నాగచైతన్య చుట్టూ తొమ్మిది చేతులు… ఒక్కో చేయిపైరాతలతో కూడిన ఈ లుక్ ‘కిల్లర్’గా ఉందంటూ రాంగోపాల్ వర్మ కూడా అభినందించాడు. నిజానికి లుక్ కూడా అలాగే ఉంది మరి!

ADVERTISEMENT

మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో చైతూ సరసన బాలీవుడ్ ఫేం నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చాలాకాలం తర్వాత ఓ బయట చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో మాధవన్, భూమికలు కూడా కనిపించనున్నారు. ఈ సమ్మర్ స్పెషల్ గా చైతూ కెరీర్ లో ఓ మరపురాని చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావంతో ఉంది.

ADVERTISEMENT
Latest Stories