పబ్లిసిటీ లేటుగా ప్రారంభించినా, అది కరెక్ట్ గా ఉంటే ఎలా ఉంటుందో “సవ్యసాచి” ధియేటిరికల్ ట్రైలర్ చెప్తుంది. నవంబర్ 2వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేయగా, వీక్షకుల మన్ననలు పొందుతోంది. చైతూ బెస్ట్ లుక్ గా కనపడుతోన్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు.
[m9ad]
ఆసక్తిని పెంచే విధంగా కట్ చేసిన ఈ ట్రైలర్ లో విలన్ గా మాధవన్ వేసిన స్కెచ్ లను అర్జునిడిలా హీరో చైతూ ఎలా చేధించాడు అన్నదే ఈ సినిమా మూలకధ. ట్రైలర్ లో కధను స్పష్టంగా చెప్పెసినప్పటికీ, హీరోకున్న ఎడమ చేతిని స్పెషల్ గా చూపిస్తూ ఆసక్తిని పెంచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక మిగిలినదంతా సిల్వర్ స్క్రీన్ పైన చూడాల్సిందే!
ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇటీవల కాలంలో సక్సెస్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ట్రైలర్ చూస్తుంటే మరో విజయం మైత్రీ ఖాతాలో పడేట్లుగానే ఉంది.



