‘అఖిల్’ భామ అదృష్టం అలా ఉంది!

Sayyeshaaతెలుగు తెరకు ‘అఖిల్’ సినిమాతోను… హిందీ తెరకు ‘శివాయ్’ సినిమాతోను పరిచయమైన సాయేషా సైగల్ కు,ఈ రెండు సినిమాలు కూడా కెరియర్ కి హెల్ప్ కాలేదు. దాంతో ఈ సుందరి తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. జయం రవి జోడీగా ‘వనమగన్’ సినిమా చేసిన ఆమె, కార్తీతో ఓ సినిమా .. విజయ్ సేతుపతితో మరో సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ పై వున్నాయి.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలోనే సాయేషా మరోసారి కార్తీ సరసన చేసే ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో కార్తీ సరసన ముగ్గురు కథానాయికలు కనిపిస్తారట. ఒక కథానాయికగా సాయేషా సైగల్ ను తీసుకున్నారని అంటున్నారు. ‘వన మగన్’ సినిమా ఫలితం ఎలా వున్నా, అమ్మడి గ్లామర్ కి అక్కడి ప్రేక్షకులు ఫిదా అయ్యారట. ఆమెకి గల క్రేజ్ కారణంగానే వరుస అవకాశాలు వస్తున్నాయనేది కోలీవుడ్ టాక్.

ADVERTISEMENT
Latest Stories