టీడీపీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతుందా?

security downgraded to tdp membersవైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు భద్రతను కుదించటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నక్సల్స్ హిట్ లిస్టు లో ఉన్న చంద్రబాబు నాయుడుకు భద్రత కుదింపు వస్తున్న విమర్శలు పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు తాజాగా కొందరు తెలుగుదేశం నేతలకు భద్రతను కుదించటం వివాదాస్పదం అవుతుంది. కొందరు నేతలకు భద్రతా సిబ్బందిని తొలగించగా, మరికొందరికి కుదించింది రాష్ట్ర ప్రభుత్వం.

ADVERTISEMENT

శాసనసభ, లోక్‌సభకు ఎన్నికైనవారికి స్థాయిని బట్టి భద్రత కల్పిస్తారు. మరికొందరు నేతలకు.. వారికి పొంచి ఉండే ముప్పు ఆధారంగా కూడా భద్రతను అందిస్తారు. అయితే టీడీపీ నేతలు ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్‌, తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్‌, బోడె ప్రసాద్‌కు ఉన్న 1+1 భద్రతను ఎన్నికల్లో ఓడిన అనంతరం తొలగించారు. ఎన్నికలలో గెలిచినప్పటికీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు భద్రతను సగానికి తగ్గించారు.

మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర భద్రతను 1+1కు తగ్గించారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా భద్రత పెంచుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ కక్ష సాధింపే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్న నేతలు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు. అయితే భద్రత వంటి కీలక విషయంలో రాజకీయం అనవసరమైన అనర్ధాలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories