“జీఎస్టీ 2”లో నటించడానికి నేను రెడీ!

shakeela ready for RGV GST 2 రాంగోపాల్ వర్మ తీసిన “గాడ్, సెక్స్, ట్రూత్” సినిమా ఎంత సంచలనం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో తాను పార్ట్ 2 కూడా తీసే ఆలోచనలలో ఉన్నట్లుగా వర్మ ఇటీవలే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సీక్వెల్ తీస్తానని అయితే చెప్పారు గానీ, అందులో హీరోయిన్ గా మళ్ళీ మియా మాల్కోవానే ఉంటుందా? లేక ఏ ఇతర హీరోయిన్ అయినా ఉంటుందా? అన్నది మాత్రం ఖరారు చేయలేదు. అయితే వర్మ తనతో తీస్తానంటే నేను రెడీ అంటోంది ఒకప్పటి సెన్సేషన్.

ADVERTISEMENT

వర్మ లాంటి దర్శకుడు అడిగితే చేయకుండా ఎలా ఉంటాం, కాకపోతే నన్ను సన్నబడి ఓ 30 కిలోల బరువు తగ్గమని చెప్తే, అదంతా జరగడానికి కనీసం రెండేళ్ళ సమయం పడుతుంది… అంటూ చిరునవ్వులు చిందిస్తూ చెప్పింది షకీలా. మలయాళ తెరను ఒక ఊపు ఊపిన షకీలా, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న వైనం తెలిసిందే. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సదరు విషయాలను వెల్లడించిన షకీలా, మహిళా సంఘాల తీరును కూడా ప్రశ్నించింది.

నిజానికి ఇప్పుడు గ్లామర్ అన్నది ఎక్కడ లేదు? కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుండి ఐటీ సంస్థలలో పని చేసే ఉద్యోగినుల వరకు అందరూ ఎలాంటి డ్రెస్ లు వేసుకుంటున్నారు? వాళ్ళ కంటే మేమే బెటర్ అన్న షకీలా, ఈ మహిళా సంఘాలు చాలా ఎక్కువ చేస్తున్నాయని మండిపడ్డారు. ‘పోర్న్’ చూసి యువత చెడిపోతుందని చెప్పడం తప్పని, ‘జీఎస్టీ’ లాంటి సినిమాలు మీకు ఇష్టం లేకపోతే చూడకండి, అంతేగానీ విడుదల చేయకూడదని ఎలా చెప్తారని ప్రశ్నించింది.

ADVERTISEMENT
Latest Stories