గాయాల పాలైన ‘జబర్దస్త్’ ఫేం షేకింగ్ శేషు!

Shaking Seshu accident in rajasthanjpg‘జబర్దస్త్’ షో ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన ‘షేకింగ్ శేషు’ ప్రస్తుతం హైదరాబాద్ లోని అమీర్ పేట, ప్రైమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మెగా హీరో సాయిధరంతేజ్ హీరోగా నటిస్తున్న ‘సుప్రీమ్’ చిత్ర షూటింగ్ లో శేషు గాయపడినట్లుగా సమాచారం. రాజస్థాన్ లో చేజింగ్ సన్నివేశం షూటింగ్ చేస్తున్న సందర్భంలో… జిప్సీ వాహనం బోల్తాపడడంతో ప్రమాదానికి గురయ్యాడని తెలుస్తోంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిధరంతేజ్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్ గా రాశి ఖన్నా కనువిందు చేస్తోంది. వీరిద్దరికీ సంబంధించిన సెల్ఫీ ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో సందడి చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు – సాయిధరంతేజ్ కాంభినేషన్ లో ‘హ్యట్రిక్’ మూవీగా రానున్న ఈ సినిమాకు ‘పటాస్’ ఫేం అనిల్ రావిపూడి దర్శకుడు.

ADVERTISEMENT
Latest Stories