ట్రైలర్ టాక్ – అన్నీ కలిపికొట్టారు… అయినా పర్లేదు..!

shatamanam-bhavati-trailer-talkగతేడాది మాదిరే ఈ ఏడాది కూడా సంక్రాంతికి మూడు డిఫరెంట్ సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అయితే ఈ మూడింటిలో కూడా సంక్రాంతి పండగ శోభను గుర్తుకు తెచ్చే విధంగా సరైన టైమింగ్ లో వస్తున్న సినిమాగా “శతమానం భవతి” సినిమా నిలుస్తుందన్న సంకేతాలను ట్రైలర్ ఇచ్చింది. సినిమా విడుదల తేదీని జనవరి 14గా ఖరారు చేస్తూ విడుదలైన ట్రైలర్ ఆహ్లాదకరమైన అనుభూతులను మిగులుస్తుంది.

చక్కని పల్లెటూరు వాతావరణం, ఇంటి నిండా చుట్టాలు, పండగ సంబరాలు… ఇవన్నీ తెలుగు సినిమాలకు కొత్త కాదు. అయితే ఎన్ని సార్లు చూసినా మానవ సంబంధాలపై ఉన్న గొప్పతనం రీత్యా… మంచి అనుభూతులను పంచుతాయి. మిక్కీ జే మేయర్ అందించిన ఆహ్లాదకరమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు తోడు, శర్వానంద్ – అనుపమ్ ల జంట ఫ్రెష్ నెస్ ను తీసుకువచ్చింది.

ADVERTISEMENT

జయసుధ – ప్రకాష్ రాజ్ లు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో మాదిరి కనపడుతున్నా… పల్లెటూరి వాతావరణం సినిమా లుక్ ను మార్చేసింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించారు. పండగ సినిమాల్లో చివరిగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తక్కువగా ఉండడం ప్రధాన ప్లస్ పాయింట్. రెండు భారీ సినిమాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమాపై పాజిటివ్ ఫీలింగ్ ను తీసుకురావడంలో ధియేటిరికల్ ట్రైలర్ సక్సెస్ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories