రాజకీయాలలో కంటే తెలుగు సినీ పరిశ్రమలోనే రాజకీయాలు ఎక్కువగా సాగుతున్నాయా? అంటే సంగీత దర్శకుడు తమన్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, నటుడు శివాజీ వంటి వారి మాటలు వింటే నిజమే అనిపిస్తుంది. పనిగట్టుకొని సినిమాలను దెబ్బ తీస్తున్నవారు కొందరైతే, సినీ నటీనటులను దెబ్బ తీస్తున్నవారు మరికొంత మంది ఉన్నారని వీరందరూ చెపుతున్నారు.
శివాజీ నిన్నమహిళా కమీషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “నా అనుకున్నవారే నా వెనుక కుట్ర చేశారు. ఎవరెవరు జూమ్ మీటింగ్స్ పెట్టుకొని ఏం మాట్లాడుకున్నారో నాకు తెలుసు. రోజూ నాతో కలిసి తిరుగుతూ, నా సినిమాలు, నటన అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నవారే నన్ను దెబ్బ తీయడానికి ప్రయత్నించడం చాలా బాధ కలిగించింది.
నేను సినీ పరిశ్రమలో 30 ఏళ్ళుగా ఉన్నాను. ఒకవేళ నా ప్రవర్తన, మాట తీరు సరిగ్గా లేకపోయుంటే నన్ను ఎప్పుడో బయటకు గెంటేసేవారు కదా? కానీ ఇన్నేళ్ళు ఉన్నానంటే అర్ధం ఏమిటి? నేను వారికి ఏం అపకారం చేశాను? నా మీద ఎందుకు ఇంత కక్ష కట్టారు?
సినీ పరిశ్రమలో సీనియర్‌గా ఓ తండ్రి పిల్లలకు చెప్పినట్లు నాలుగు మంచి మాటలు చెప్పాను. వాటిలో మంచిని వదిలి చెడునే చూశారు. నా గురించి చాలా మంది చాలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వాటిని ఎవరూ మార్చలేరు. కనుక నాపై ఇతరుల అభిప్రాయల గురించి నేను మాట్లాడినా ప్రయోజనం ఉండదు,” అని శివాజీ అన్నారు.
మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు తప్పా ఒప్పా అనే విషయం పక్కనబెడితే, సినీ పరిశ్రమలో ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకుంటూ, అవకాశం చిక్కితే దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారని శివాజీ, తమన్, వంశీ నందిపాటి తదితరుల మాటలతో స్పష్టమవుతుంది కదా?
ఎవరు ఎవరు ZOOM మీటింగ్‌లు పెట్టుకున్నారో …
నా తో బాగా ఉండి… నా తో మంచిగా మాట్లాడుతూ…
ఇంత కుట్ర చెయ్యాలా నా మీద… #Sivaji pic.twitter.com/Pc4EQ43dPS
— M9 NEWS (@M9News_) December 27, 2025



