హాలీవుడ్ హీరోయిన్లు చేస్తున్నారు… మేం చేయకూడదా..!

Shriya Saran about her characters in movie‘ఇష్టం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రియాకు ఇప్పటికీ టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉండడమే కాదు, గతంలో చేయలేని అద్భుతమైన పాత్రలు ప్రస్తుతం శ్రియా వశం అవుతున్నాయి. దీంతో సహజంగానే ట్రేడ్ వర్గాలతో పాటు మీడియా వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే ప్రశ్న మీడియా వర్గాలు శ్రియాను ప్రశ్నిస్తే… వారికి ఓ చిన్న సైజు క్లాస్ నే తీసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ADVERTISEMENT

ఇటీవల తనకు వస్తున్న పాత్రలు అన్ని విలక్షణంగా ఉంటున్నాయని, తన కోసం రచయితలు కొత్త పాత్రలను సృష్టిస్తున్నారని, ప్రేక్షకులు ఇంకా తనను ఆదరించడం వలనే ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్ళయినా కొనసాగుతున్నానని చెప్పుకొచ్చిన శ్రియా, ఇంతవరకు మోహన్ బాబు గారితో చేయలేకపోయానన్న బాధ ‘గాయత్రి’ సినిమాతో తీరిపోయిందని, ఈ సినిమాలో చిన్న పాత్రే అయినా కధను మలుపు తిప్పే పాత్రని తెలిపింది.

రెండు దశాబ్దాలు గడిచినా ఇంకా మీకు ఆఫర్లు వస్తున్నాయని ఇటీవల ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారని, అసలు ఇలాంటి ప్రశ్నలు ఎలా వస్తాయని, హాలీవుడ్ హీరోయిన్ మెరిల్ స్ట్రీప్ వంటి వారు 60 ఏళ్ళ వరకు నటించిందని చెప్పిన శ్రియా, మేం నటించకూడదా? అంటూ దుయ్యబట్టింది. భవిష్యత్తులో మరిన్ని ఆఫర్లు వచ్చినా, మళ్ళీ మళ్ళీ అడగకుండా ఒక్కసారే మీడియాకు క్లాస్ తీసుకుంది ఈ ఢిల్లీ బొమ్మ.

ADVERTISEMENT
Latest Stories