బాలయ్యకు విలనా..? పుకారే అబ్బాయ్..!

Sikanth villain for balakrishnaతెలుగు తెరపై హీరోగా తనదైన ముద్ర వేసిన శ్రీకాంత్, ఇప్పుడు కూడా అడపా దడపా హీరోగా చేస్తూనే… కీలకమైన పాత్రల్లోను చేస్తున్నాడు. తాజాగా ఆయన ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు.

ADVERTISEMENT

“కెరియర్ ఆరంభంలో విలన్ గా ఓ 15 సినిమాలు చేశాను .. ‘ఒన్ బై టూ’తో హీరోగా గుర్తింపు వచ్చింది. ఆ తరువాత చేసిన ‘ఆమె’ .. ‘తాజ్ మహల్’ .. ‘పెళ్లి సందడి’ .. ‘ఆహ్వానం’ .. ‘ఎగిరే పావురమా’ ఇలా వరుస హిట్లు పడ్డాయి” అన్నారు.

‘త్వరలో బాలకృష్ణ చేయనున్న సినిమాలో విలన్ గా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి… నిజమేనా?’ అనే ప్రశ్న శ్రీకాంత్ కి ఎదురైంది. ‘ ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు. అవకాశమిస్తే తప్పకుండా చేస్తా .. ఒక రకంగా చెప్పాలంటే విలన్ గా చేస్తేనే ఏ టెన్షనూ ఉండదు’ అంటూ చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
Latest Stories