‘ఊపిరి’కి ప్రాణం పోసిన ‘సిరివెన్నెల’

sirivennela-sitarama-sastry-oopiri-songsతెలుగు సినిమాకు సాహిత్యపు వైభోగం మళ్ళీ వస్తున్నట్లే కనపడుతోంది. కధకు సంబంధం లేకుండా ముద్దుగుమ్మల అందచందాలు ప్రదర్శించే పాటల కంటే కూడా కధతో పాటు ప్రయాణించి, ప్రేక్షకులను సినిమాలో లీనం చేసే పాటలకే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. లేదంటే పాటలు వస్తున్న సమయం ప్రేక్షకులకు మరో ఇంటర్వెల్ లా మారుతున్న వైనం ధియేటర్లలో మనం చూస్తున్నదే!

కధకు తగిన విధంగా సాహిత్యపు విలువలతో కూడిన పాటలు రాయడంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సిద్ధహస్తులు. ఎటువంటి భావోద్వేగమైనా సిరివెన్నెల ‘కలం’ నుండి జాలువారితే అవి చెవులకు ఇంపుగా ఉంటాయి. ఇటీవల కాలంలో కాస్త తగ్గుముఖం పట్టిన సిరివెన్నెల కలం నుండి నాగార్జున – కార్తిల మల్టీస్టారర్ “ఊపిరి” పోసుకుంది. ఈ సినిమాలో ఉన్న 7 పాటలో 6 పాటలకు సిరివెన్నెల సాహిత్యం అందించగా, మరో పాటకు తన శిష్యుడు రామజోగయ్య శాస్త్రి రచించారు.

ADVERTISEMENT

దీనికి సంబంధించిన ఆడియో కార్డ్ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకుల ఆసక్తిని పొందడంలో సక్సెస్ కావడంతో “ఊపిరి” సినిమాపై భారీ అంచనాలు నేలకొన్నాయి. మార్చి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆడియో వేడుక ఈ వారాంతంలో జరగనుంది.

ADVERTISEMENT
Latest Stories