పోలీసులకు పవన్ కళ్యాణ్ సోదరుడు ఫిర్యాదు!

siva balaji lodges complaint in cyber crime police stationపవర్ స్టార్ ‘కాటమరాయుడు’ సినిమాలో పవన్ కళ్యాణ్ కు సోదరులుగా చేసిన నలుగురిలో ప్రముఖ హీరో శివబాలాజీ కూడా ఒకరు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ శివబాలాజీకి మంచి పేరునే తీసుకువచ్చింది. అలా పవన్ సోదరుడిగా పిలవబడుతున్న శివబాలాజీ, తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

ADVERTISEMENT

తన భార్య మధుమిత మొబైల్ ఫోన్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుండి మెస్సేజ్ లు వస్తున్నాయని, ఈ మెస్సేజ్ లు బయటకు చెప్పుకోలేనంత అసభ్యంగా ఉన్నాయని, తనపై ఉన్న కోపంతో నన్ను ఏమీ చేయలేక తన భార్యను టార్గెట్ చేస్తున్నారని శివబాలాజీ ఆరోపించారు.

యూ ట్యూబ్ వీడియోలలో అశ్లీలత, మార్ఫింగ్ ఫోటోల సంస్కృతి పెరిగిపోవడాన్ని తాను గట్టిగా ఖండించడంతో కొందరు తనపై కక్ష కట్టారని, ఈ మెస్సేజ్ లు పంపింది వారి మనుషులేనని చెప్పిన శివబాలాజీ, అతి త్వరలోనే పోలీసులు నిందితులను అరెస్ట్ చేస్తారన్న నమ్మకముందని అన్నారు.

సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే, ఇక సమాజంలో సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పలు సినిమాలలో నటించిన మధుమతి, వివాహం తర్వాత సిల్వర్ స్క్రీన్ కు పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories