హీరోయిన్లను మోసం చేస్తున్న మాట నిజమే!

Sivaji Raja on actresses remunerationతెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ల కొరత ఉందన్నది బహిరంగ సత్యం. అయితే ఎన్నడూ లేని విధంగా ఇంత కొరత ఎందుకు ఏర్పడింది? అన్న దానిపై ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. హీరోయిన్లకు – నిర్మాతలకు మధ్య సినీ పరిశ్రమలో దళారులున్నారని, వారే హీరోయిన్ల అవకాశాలను పాడు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అందరూ కాకపోయినా 30 శాతం మంది మేనేజర్లు అలాగే ఉన్నారని, వారి వల్ల హీరోయిన్లకు వచ్చే అవకాశాలు రాకుండా పోతున్నాయని అన్నారు.

ADVERTISEMENT

సినీ పరిశ్రమలో దళారుల ప్రమేయం వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయని, వారిని మొత్తం కట్ చేస్తే కానీ పరిస్థితులు చక్కబడవని తెలిపారు. వారిని కట్ చేసేంత వరకు తెలుగు చిత్ర పరిశ్రమకు మంచిమంచి హీరోయిన్ల కొరత వెంటాడుతూనే ఉంటుందని, వారిలో వారు కుమ్మక్కై హీరోయిన్లను ఖాళీగా ఉంచుతున్నారని, మరికొందరు అవకాశాలను పాడు చేస్తున్నారని చెప్పాడు. ఇక ఇలాంటి సమస్యలు తలెత్తితే పరిష్కరించే పెద్ద దిక్కు లేకుండా పోయిందని, దాసరి నారాయణరావు గారి తర్వాత ఈ కొరత ఏర్పడిందని అన్నారు.

ప్రతి సమస్యకు దాసరి గారు పరిష్కారం వెతికే వారని, ఆయన దగ్గరకు ఏ సమస్య వెళ్లినా దానిని పరిష్కరించేంత వరకు విశ్రమించే వారు కాదని, సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఆయన వద్దకే వెళ్లేవారని చెప్పారు. సినీ కుటుంబ పెద్దగా ఆయన రెండు వర్గాలను వెనకేసుకొచ్చేవారని, రెండు వర్గాలకు న్యాయం చేసేవారని, ఆయన మహానుభావుడని, ఆయన తరువాత సినీ పరిశ్రమలో ఆ స్థానంలో ఎవరూ లేరని, ఇప్పుడు ఎవడికి వాడే ఒక దాసరి నారాయణరావు అని చెప్పిన శివాజీరాజా, తాను మా అధ్యక్షుడయ్యేందుకు కూడా దాసరే కారణం అన్నారు.

ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడిగా ఉన్నా, 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, ఏ పార్టీ అన్నది ఇప్పుడే చెప్పలేను గానీ, గత 20 ఏళ్లుగా తాను బీజేపీలోనే ఉన్నానని, ప్రతి ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నానని, కృష్ణంరాజు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే తాను బీజేపీలో చేరానని అన్నారు. ఏపీలో పుట్టినా కేవలం 15 ఏళ్లు మాత్రమే అక్కడ ఉన్నానని, తరువాత జీవితమంతా తెలంగాణలోనే అన్న శివాజీ, తన రాజకీయ జీవితం కూడా తెలంగాణాలోనే ఉంటుందని స్పష్టత చేసారు. సినీ పరిశ్రమ హైదరాబాద్ ను విడిచి వెళ్ళే ప్రసక్తే లేదని, అలా వస్తే అవన్నీ ఒట్టి పుకార్లేనని తేల్చిపారేసారు.

ADVERTISEMENT
Latest Stories