‘వై ఎస్ ఆర్’ పై సోము వీర్రాజు ప్రశంసల జల్లు

Somu Veerraju praises YSRబిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ది ఎప్పుడు విలక్షణ పాత్ర. సొంత పార్టీని బలోపేతం చెయ్యడానికి ఆయన చేసేది ఏమీ ఉండదు ఐన మిత్ర పక్షం తెదేపా ను గిళ్లుతూ ఎప్పుడు వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తారు ఆయన. కొందరు ఆయన జగన్ పక్షపతి అని కూడా అంటారు.

ADVERTISEMENT

వైఎస్ రాజశేఖరరెడ్డి తవ్వించిన కాల్వల వల్లే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు పంపించగలిగామని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషిని విస్మరించజాలమని అన్నారు. ఐతే ఒకప్పుడు పట్టిసీమను వ్యతిరేకించిన వాళ్ళలో జగన్ పార్టీ వారితో పాటు సోము వీర్రాజు కూడా ఉన్నారు.

.2005 లో వైఎస్ ఆరంబించినప్పుడు ఐదు వేల కోట్ల అంచనాగా ఉందని,ఎనిమిదేళ్లలో అది పదహారువేల కోట్లకు చేరిందని, మరి ఈ మూడేళ్లలో ఎంత వ్యయం పెరగాలని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఏభైఎనిమిది వేల కోట్లు అవుతుందన్నది తెలియవలసి ఉందని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories