Somu Veerraju visited the Polavaram projectరాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్ట్ ను సందర్శించిన అనంతరం అక్కడి నుంచి పునరావాస కాలనీకి వెళ్లారు. నిర్వాసితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుకు రూ.11 వేల కోట్లు ఇచ్చిందన్నారు. అందులో రూ.7 వేల కోట్లు ప్రాజెక్టు నిర్మాణానికి, రూ.4 వేల కోట్లు పునరావాసానికి ఖర్చు చేశారని తెలిపారు.

ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల నిర్మాణంలో శ్రద్ధ వహించని ప్రభుత్వం పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేయాలనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే కేంద్రం కూడా అలానే ఉండాలా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల విషయంలోనూ శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని సోము వీర్రాజు అన్నారు.

ప్రాజెక్టు ముంపులో ఉన్న నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి వెంటనే అక్కడి నుంచి తరలించాలని డిమాండ్‌ చేశారు. అయితే ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలకు కారణం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కదా? విభజన చట్టం ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి ఖర్చు కేంద్రమే భరించాల్సి ఉండగా… తాము ప్రాజెక్ట్ నిర్మాణం వరకే భరిస్తామని కేంద్రం మెలిక పెట్టడమే నిర్వాసితుల సమస్యలకు మూలకారణం. ఆ విషయం మాటలకుండా ఏం మాట్లాడుతున్నట్టు ఆయన?