స్పీకర్ ఎన్నికలలో గెలవరు అనే సెంటిమెంట్ ను కోడెల బద్దలు కొడతారా?

kodela siva prasadఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గం నుండి మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 1972 నుంచి 2004 వరకు ఏ ఒక్కరూ రెండోసారి గెలవలేదు. ఆ ఆనవాయితీకి యర్రం వెంకటేశ్వరరెడ్డి బ్రేక్‌ వేశారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీ తరఫున వరుసగా రెండుసార్లు (2004, 2009) గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున కోడెల శివప్రసాదరావు ఎన్నికయ్యారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 924 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.

ఇప్పుడు మరోసారి బరిలో నిలిచారు. సత్తెనపల్లిలో కోడెల పై బాగా ప్రజావ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా ఆయనకు చంద్రబాబు మళ్ళీ అవకాశం ఇచ్చారు. అదే సమయంలో వైకాపా నుండి అంబటి రాంబాబు పోటీ చేస్తున్నారు. ఆయనకు సొంత పార్టీ శ్రేణుల నుండే వ్యతిరేకత ఉన్నా జగన్ మరో అవకాశం ఇచ్చారు. ఎన్నికలయ్యాక కనీసం నియోజకవర్గం లో కనిపించకుండా మాయం అయిపోయారు అంబటి. పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యారు. అయితే అభ్యర్థిత్వం ఖరారు అయ్యాక కోడెల స్పీడ్ పెంచారు.

ADVERTISEMENT

అందరి నేతలను కలుపుకుని పోతున్నారు. దీనితో కోడెల స్వల్పమెజార్టీ తోనైనా బయటపడతారని టీడీపీ అభిప్రాయపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో స్పీకర్ గా పని చేసిన వారు ఎన్నికలలో గెలవరనే ఒక సెంటిమెంటు ఉంది. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికలలో కూడా అక్కడి స్పీకర్ ఓడిపోయారు. దీనితో కోడెల ఏం చేస్తారు అనేది చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో సీనియర్ నేతగా ఉన్న కోడెలకు ఇదే చివరి ఎన్నిక. రాజధాని ఏరియాకు దగ్గరలో ఉండే ఈ నియోజకవర్గం ఈ సారి ఎటువైపు నిలుస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories