హీరో నిఖిల్ కు తన తదుపరి చిత్రం స్పై నిర్మాతకు రిలీజ్ డేట్ విషయంగా జరుగుతున్న రచ్చ తెలిసిందే. జూన్ 29 కి రాలేమని హీరో, షూటింగ్ సీజీ అవ్వకపోయినా… రావాల్సిందే అని ప్రొడ్యూసర్ పట్టుబట్టడం తెలిసిందే.
Also Read – ఇక దువ్వాడ జీవితం మాధుర్యమే
ఈ వార్త మిర్చి9 లో ముందుగా రావడంతో కొన్ని మీడియాలలో వేరే వార్తలు ప్లాంట్ చెయ్యడం మొదలుపెట్టారు. ఇందులో రెండు విషయాలు… నిఖిల్ చాలా గ్రీడీ అని… అందరి నిర్మాతలను ఇలానే ఇబ్బంది పెడతాడని ఒకటి.
ఇంకోటి జూన్ 29న రాకపోతే అమెజాన్ తో ఇబ్బంది అని… ఇప్పుడు రెండిటినీ విడివిడిగా చూద్దాం.
Also Read – విద్యార్థుల ఆత్మహత్యలు…పాపం ఎవరిదీ.?
నిఖిల్ గ్రీడీ అనేది ఏ విషయంలోనో స్పష్టత లేదు. మిగతా సినిమాల సంగతి తెలీదుగానీ… స్పై విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో సీజీ కరెక్షన్స్ చెయ్యాలని, అలాగే 15,16 లో ఒక స్పెషల్ సీక్వెన్స్ చెయ్యాలి కాబట్టి టైమ్ సరిపోదని నిఖిల్ వాదన.
అవుట్ ఫుట్ బాగా రాలవని పట్టుబట్టడం గ్రీడీ అయితే నిఖిల్ లాంటి హీరోలు గ్రీడీ గానే ఉండాలి. ఎందుకంటే సినిమా సక్సెస్, ఫెయిల్యూర్, అనేది వారి పేరు మీదే ఉంటుంది కాబట్టి.
Also Read – జగన్ అనుకున్నట్టే బట్టలు ఊడతీస్తున్నారుగా…
ఇక అమెజాన్ తో ఇబ్బంది విషయానికి వస్తే… అమెజాన్ ఫలానా రిలీజ్ డేట్ కే రావాలని క్లాజ్ పెట్టడం జరగదు. అగ్రిమెంట్ కి మాత్రం ఒక ఏడాది వాలిడిటీ ఉంటుంది. స్పై కి ఉన్న బజ్ కి అమెజాన్ తొందరపడదు. షూటింగ్ అవ్వకుండా, సిజీ అవ్వకుండా రిలీజ్ చెయ్యమనే ప్రత్యేక పరిస్థితులు ఏమీ లేదు.
పైగా ఈ నెల 15,16 లో షూట్ చెయ్యబోయే బ్లాక్ లో ఒక స్పెషల్ రోల్ ఉంటుంది. దాని వల్ల సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. అమెజాన్ కి ఆ విషయం ఇప్పటికే నిఖిల్ చెప్పడం వాళ్ళు బెస్ట్ అవుట్ ఫుట్ కి కంప్రమైస్ కావొద్దు అని చెప్పడం జరిగిపోయిందట.
ఇప్పుడు కొత్తగా అమెజాన్ తో ఇబ్బంది అంటూ కథలు మొదలుపెట్టారు.
ఈ విషయంలో ఇప్పటికైనా ప్రొడ్యూసర్ వివేకంతో ఆలోచించాలి… హీరో మీద ప్లాంటేడ్ స్టోరీలు మానేసి… ఒక మాట మీదకు వచ్చి సినిమా విడుదల చేసుకోవాలి. లేదంటే నాన్-రెగ్యులర్ నిర్మాతలతో సినిమాలు చేస్తే ఇంతే…. వాళ్ళ లాభం చూసుకుంటారు గానీ సినిమా గానీ హీరోలు గానీ పట్టారు అనే అపవాదు మూటగట్టుకుంటారు