కోహ్లి సెంటిమెంట్… మరోసారి 600 దాటింది..!

sri-lanka-vs-india-test-series- 2రెండవ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లోనూ టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 622 పరుగుల భారీ స్కోర్ ను వద్ద డిక్లేర్ చేసింది. ఇక ఈ భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన లంక జట్టు రెండవ రోజు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు నమోదు చేసింది. లంక ఓపెనర్లిద్దరినీ పెవిలియన్ పంపిన ఘనతను అశ్విన్ దక్కించుకున్నాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఏదయితే జరిగిందో… రెండవ మ్యాచ్ లోనూ అదే సెంటిమెంట్ రిపీట్ కావడం విశేషం.

గాలే వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా టీమిండియా 600 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా, అందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం చేసింది 3 పరుగులే. అదే ఆ ఇన్నింగ్స్ లో లోయెస్ట్ స్కోర్. తాజాగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ స్కోర్ బోర్డు లో కూడా అదే సీన్ రిపీట్ కావడం విశేషం. టీమిండియా తరపున బరిలోకి దిగిన 10 మంది బ్యాట్స్ మెన్లలో కోహ్లి చేసిన 13 పరుగులే అత్యల్ప స్కోర్. అంటే 622 పరుగులలో కోహ్లి కాంట్రిబ్యూషన్ కేవలం 13 పరుగులు మాత్రమే.

ADVERTISEMENT

ఉమేష్ యాదవ్ చేసింది 8 పరుగులే అయినా, నాటౌట్ గా నిలవడంతో, కోహ్లిదే అత్యల్ప స్కోర్ గా భావించాల్సి ఉంటుంది. ఇతర బ్యాట్స్ మెన్లను గమనిస్తే… ధావన్ 35, రాహుల్ 57, పుజారా 133, రెహానే 132, అశ్విన్ 54, సాహా 67, పాండ్య 20, జడేజా 70, షమీ 19 పరుగులు చేసారు. ఈ మ్యాచ్ ద్వారా 2000 పరుగులు, 250 వికెట్లు వేగంగా అందుకున్న జాబితాలో అశ్విన్ (51 మ్యాచ్ ల ద్వారా) మొదటి స్థానంలో నిలిచారు. రిచర్డ్ హ్యాడ్లీ (54), ఇమ్రాన్ ఖాన్ (55), ఇయాన్ బోథం (55) మ్యాచ్ లలో ఈ రికార్డును అందుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories