“రాజకీయం బాగానే వంటబట్టింది గడుగ్గాయికి… అన్నయ్య అభిమానులకి బిస్కెట్స్ మరియు తిట్ల వర్షం… అన్నయ్య కొత్త సినిమా పేరు కూడా తెలియదు, అన్నయ్య అంటే అభిమానం, నువ్వు సూపరేహే… జనం డబ్బు దొబ్బేసి దాక్కుని తమ్ముడుని పంపాడు జనాల మీదకి మీ అన్న… దొందూ దొందే… తోడు దొంగలు… ఇవన్నీ తెలిసినా పట్టించుకోని ఎర్రి పువ్వులు, మెంటల్లీ డిస్ట్రబ్డ్, మ్యాడ్ ఉండి ఏ పెంటలో పడుకుని దోల్లుతారో అర్ధం కాని వాళ్ళందరూ ఇంతని ఫ్యాన్స్…” – ఇది శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ లో లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్.
ఇటీవల కాలంలో కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పవన్ ను టార్గెట్ చేసుకుంటూ శ్రీరెడ్డి విసిరిన విసుర్లు, కసుర్లు. ముఖ్యంగా మెగా అభిమానులతో ‘ఆత్మీయ సదస్సు’ పేరుతో పవన్ నిర్వహించిన కార్యక్రమం తర్వాత సోషల్ మీడియాలో కూడా పవన్ పై తీవ్ర స్తాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘పాత సీసాలో కొత్త సారా’ మాదిరి ‘జనసేనను ప్రజారాజ్యం 2.0’గా అభివర్ణిస్తూ చేస్తోన్న పోస్ట్ లకు కొదవలేదు. నెటిజన్లు అంతలా విమర్శిస్తుంటే… ఇక బోల్డ్ గా స్పందించే శ్రీరెడ్డి ఈ స్థాయిలో దాడి చేయడానికి అవకాశం చిక్కినట్లయ్యింది.



