ఎవరైనా సరే… వదిలేది లేదన్న క్లాస్ దర్శకుడు..!

Sri-Reddy---Sekhar-Kammulaశేఖర్ కమ్ముల… తెలుగు సినీ పరిశ్రమలో ‘క్లీన్’ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఫ్యామిలీ మొత్తం కళ్ళు మూసుకుని వెళ్లి చూడగలిగే సినిమాలను మాత్రమే అందించే శేఖర్ కమ్ములపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు తెలిసిందే. ఫేస్ బుక్ వేదికగా చేసిన కామెంట్స్ పై శేఖర్ కమ్ముల తాజాగా స్పందించారు.

“ఆమె చెప్పిన ప్రతి అక్షరం అబద్ధమేనని, తను ఎవరో కూడా తెలియదని, ఇది తనకు, తన కుటుంబానికి అవమానకరంగా భావిస్తున్నానని, ఈ దిగజారుడు చర్య వెనుక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, తాను అలాంటి వ్యక్తిని కానని, స్త్రీల సమానత్వం నా సినిమాలు చూస్తే అర్ధమవుతుందని” స్పష్టం చేసారు.

ADVERTISEMENT

అయితే ఈ పోస్ట్ ను నేను సాధారణంగా వదిలిపెట్టబోనని, ఆ పోస్ట్ లోని ప్రతి మాట తప్పని ఒప్పుకుని, క్షమాపణ చెప్పకపోతే చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని సోషల్ మీడియా ద్వారా శేఖర్ కమ్ముల స్పష్టం చేసారు. నిజానికి శేఖర్ పై ఇలాంటి అభియోగాలు చేయడం అనేది శ్రీరెడ్డికి బాగా మైనస్ అయ్యిందనే చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories