మహేష్ తో అయితే… డోర్లు ఓపెన్ చేసింది..!

Sridevi says Jhanvi kapoor likes to act with  Mahesh babu‘అతిలోకసుందరి’ శ్రీదేవి కూతురు జాహ్నవి సినీ తెరంగ్రేటం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటోంది. ఓ పక్కన జాహ్నవి పొట్టి పొట్టి బట్టలేసుకుని కెమెరాలకు చిక్కుతుండగా, మరో పక్కన తన కూతురికి పెళ్లి చేయాలని అనుకుంటున్నానని శ్రీదేవి చెప్తుండడం కొసమెరుపు. అయితే తన కూతురు సినిమాల్లో హీరోయిన్ గా కనిపిస్తానంటే తనకేమీ అభ్యంతరం లేదని, తాను కూడా అక్కడి నుండే వచ్చానని ఇటీవల చెప్పిన శ్రీదేవి, పరోక్షంగా జాహ్నవి తెరంగ్రేటం పట్ల సుముఖత వ్యక్తం చేసింది.

ADVERTISEMENT

ఇక గతంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుందని, మహేష్ తో అవకాశం వచ్చింది గానీ ఒప్పుకోలేదని ఇలా రకరకాలుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో తాజాగా ‘అతిలోకసుందరి’ చెప్పుకొచ్చింది. మహేష్ తో అవకాశం రావడం, దానిని జాహ్నవి వద్దనడం కేవలం పుకార్లు మాత్రమేనని, నిజానికి మహేష్ అంటే జాహ్నవి చాలా ఇష్టమని, ఇప్పటివరకు మహేష్ నటించిన అన్ని సినిమాలను చూసిందని, స్టైల్, యాక్టింగ్ అంటే బాగా ఇష్టమని ప్రిన్స్ గురించి చెప్పుకొచ్చింది.

ఒకవేళ మహేష్ తో ఛాన్స్ వస్తే నేను కూడా థ్రిల్ గా ఫీల్ అవుతానని, అది ఎప్పుడైనా అంటూ శ్రీదేవి క్లారిటీ ఇవ్వడంతో జాహ్నవి సినీ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. అయితే అది టాలీవుడ్ హీరోతోనా? బాలీవుడ్ హీరోతోనా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. జాహ్నవి ఫాస్ట్ నెస్ చూస్తుంటే… హాలీవుడ్ సినిమాతో ఓపెన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ‘మామ్’ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి సదరు సంగతులన్నీ తెలిపింది.

ADVERTISEMENT
Latest Stories