అమ్మాయిలను ఇంప్రెస్ చేయ్యడానికి జగన్ మీద కోడి కత్తి దాడా?

YS-Jagan-Attacker-Srinivasవిశాఖపట్నం పోలీసు కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా అక్టోబర్‌ 25న జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడికి సంబంధించి మీడియాతో మాట్లాడారు. దాడి జరిగిన రోజున నిందితుడు శ్రీనివాస్‌ ఉదయం 8 గంటలకు హేమలత, అమ్మాజీ అనే ఇద్దరు మహిళలకు ఫోన్‌ చేసి ‘ఈ రోజు నన్ను టీవీలో చూస్తారు’ అని, అమ్మాజీతో ‘ఒక సంచలనం చూస్తారు’ అని పలుమార్లు శ్రీనివాస్‌ చెప్పాడని కమీషనర్ మీడియా దగ్గర పేర్కొన్నారు. పైగా ఎంపీ, ఎమ్మెల్యే మాదిరిగా నా వద్దకు కూడా పీఏ అపాయింట్‌మెంట్‌ తీసుకొని రావాలని ఆమెతో చెప్పాడని తెలిపారు.

[m9ad]

ADVERTISEMENT

దీనితో అమ్మాయిలను ఇంప్రెస్స్ చేయ్యడానికి తనని తాను హీరో గా చూపించుకోవడానికే శ్రీనివాస్ ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఉదయం 9 గంటల సమయంలో ఎయిర్ పోర్టులోని రెస్టారెంట్‌లో కూడా కోడికత్తికి సానపెట్టాడని తెలిపారు. రెండుసార్లు కోడికత్తిని వేడి నీటిలో స్టెరిలైజ్‌ చేశాడని విచారణలో తేలిందట. జగన్‌పై అక్టోబర్‌ 18నే దాడికి శ్రీనివాస్‌ పథక రచన చేశాడని, అక్టోబర్‌ 17నే జగన్‌ విశాఖ నుంచి వెళ్లిపోవడంతో అతడి పథకం ఫలించలేదని కూడా పోలీసుల విచారణలో తేలింది.

జాతీయ సంస్థలు చెయ్యల్సిన దర్యాప్తు రాష్ట్రప్రభుత్వాన్ని కాపాడటం కోసం ఇక్కడి పోలీసులు చేస్తున్నారనే ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. జాతీయ భద్రతా అంశాలు ఉంటేనే ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందని, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని గంటల్లోనే వివరాలు చెప్పాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఈ విషయంపై హై కోర్టులో జగన్ వేసిన పిటిషన్ పెండింగులో ఉంది. పోలీసు కమిషనర్‌ హడావుడిగా విలేకరుల సమావేశం పెట్టి కేసు వివరాలు వెల్లడించడంపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు చెప్పిందే మళ్లీ చెప్పారని, కొత్తగా ఏం చెప్పలేదని పేర్కొన్నారు. సూత్రధారులను తప్పించేందుకే రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు.

ADVERTISEMENT
Latest Stories