నితిన్, రాశి ఖన్నా జంటగా ‘శతమానం భవతి’ ఫేం వేగేశ్న సతీష్ దర్శకత్వం వహిస్తోన్న “శ్రీనివాస కళ్యాణం” సినిమాను ఆగష్టు 9వ తేదీన విడుదల చేయబోతున్నామని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే అధికారిక ప్రకటన చేసారు. విడుదలకు సరిగ్గా మరో నెల రోజుల సమయం ఉన్న ఈ సినిమా పబ్లిసిటీని మొదటి పాట లిరికల్ వీడియోతో ప్రారంభించారు.
‘కళ్యాణం వైభోగం’ అంటూ సాగే ఈ పాట సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ మార్క్ తో రూపొందింది. శ్రీమణి అందించిన అచ్చ తెలుగు సాహిత్యం అద్భుతంగా ఉండగా, దానికి గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరం వినసొంపుగా మార్చేసింది. ప్రతి పెళ్లి ఆల్బమ్ లో వినిపించే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ లా రూపొందించడంలో చిత్ర యూనిట్ పూర్తిగా సక్సెస్ అయ్యింది.
ADVERTISEMENT
ADVERTISEMENT



