వావ్… టెర్రిఫిక్… బాలయ్యపై రాజమౌళి..!

Gautamiputra Satakarni - SS Rajamouliతనకు ఏది నచ్చినా నిర్మొహమాటంగా చెప్పే దర్శకధీరుడు రాజమౌళి తాజాగా “గౌతమీపుత్ర శాతకర్ణి” ఫస్ట్ లుక్ పోస్టర్ పై కామెంట్ చేసారు. పోస్టర్ విడుదలై రెండు రోజులు గడిచిన తర్వాత ఇప్పుడేంటి జక్కన్న కామెంట్ అనుకుంటున్నారా… మరి దర్శకధీరుడు ఆ పోస్టర్ ను లేటుగా చూసారంటా! చూసిన తర్వాత ట్విట్టర్ కు పని చెప్పారు.

‘సా దిస్ పిక్ లేట్… వావ్… టెర్రిఫిక్…’ అంటూ తన అభిప్రాయాన్ని తెలుపుతూ “గౌతమీపుత్ర శాతకర్ణి” పోస్టర్ పై కామెంట్ చేసారు రాజమౌళి. నిజానికి ఈ పోస్టర్ చూస్తే అలాంటి అభిప్రాయమే కలుగుతుంది. నుదుటిపై బాలకృష్ణ నెత్తుటి మరకలు, శిరస్సుకు పాగా, పక్కనే రెపరెపలాడే జెండా… అలా చూడగానే వీక్షకులను కట్టిపడేస్తున్న పోస్టర్ పై జక్కన్న కామెంట్ కొత్తది కాకపోయినా… టాలీవుడ్ అగ్ర దర్శకుడి ప్రశంసలు ప్రత్యేకమే కదా..! జక్కన్న చేసిన ట్వీట్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ యూనిట్ కు మాంచి బూస్టింగ్ ఇస్తాయని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories