పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ‘బ్రేకింగ్’ న్యూస్!

SS Thaman Music Pawan Kalyan Trivikram Movieపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఓ బ్రేకింగ్ న్యూస్. అందరి స్టార్ హీరోలను తన సంగీతంతో ఒక ఊపు ఊపిన సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ తొలిసారిగా పవర్ స్టార్ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా థమనే సోషల్ మీడియా ద్వారా ఖరారు చేసాడు. తమిళ దర్శకుడు నీసన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించబోతున్న సినిమాకు థమన్ ‘దూకుడైన’ మ్యూజిక్ ను అందించేందుకు సిద్ధమయ్యారు.

థమన్ ఈ సమాచారం అందించారో లేదో మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘ఆల్ ది బెస్ట్’ చెప్తూ ట్వీట్ చేసారు. థమన్ సంగీతం అంటే డప్పులతో ఊపేస్తాడన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డ్యాన్స్ లు వేసే హీరోలకు థమన్ బెస్ట్ ఛాయిస్. అందువలనే ‘సరైనోడు’ సినిమాలో ఒక్క పాట కూడా వినడానికి బాగోనప్పటికీ, విజువల్ గా అల్లు అర్జున్ డ్యాన్స్ లతో కవర్ చేసి ఆడియోను హిట్ చేసుకున్నాడు.

ADVERTISEMENT

మరి అలాంటి థమన్ ను పవర్ స్టార్ సినిమాకు ఎందుకు ఎంపిక చేసారు అన్న దాని పైనే ఒక స్పష్టత వస్తోంది. ప్రస్తుతం సంగీతం అందించే దర్శకులలో థమన్ కంటే ఫాస్ట్ గా అందించే దర్శకులు మరొకరు లేరు. ఈ కారణంగానే థమన్ ఎంపిక జరిగిందని ట్రేడ్ వర్గాల టాక్. అయితే థమన్ అందించే పాటలు ఎలా ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయే స్థాయిలోనే ఉంటోంది. ఒక రకంగా మణిశర్మ, దేవిశ్రీప్రసాద్ ల తర్వాత అంతటి స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ ను అందించే సంగీత దర్శకుడిగా థమన్ కు మంచి పేరుంది.

ADVERTISEMENT
Latest Stories