చేసింది రెండే సినిమాలు అయినప్పటికీ.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా, డైరెక్టర్ గా, యాక్టర్ గా అందరికీ నోటెడ్ అయ్యాడు సుమంత్ ప్రభాస్. ముఖ్యంగా మొదటి సినిమా “మేం ఫేమస్” పబ్లిసిటీ విషయంలో సుమంత్ చేసిన హడావుడికి ఇండస్ట్రీ మొత్తం “ఎవర్రా బాబు ఇతను” అతడి వైపు తిరిగి చూసింది.
ఇక రెండో సినిమా “గోదారి గట్టుపైన” విషయంలోనూ ఇంచుమించుగా అదే ఫార్మాట్ ను ఫాలో అయ్యాడు సుమంత్ ప్రభాస్. రిలీజ్ కి ముందు నాస్టాల్జియా అంటూ పాత సమ్మర్ యాడ్స్ ని రీక్రియేట్ చేసాడు, రిలీజ్ తర్వాత గోదావరి జిల్లాల్లో పాదయాత్ర చేశాడు. తన సినిమాని మాత్రమే కాక తనను తాను జనాల్లోకి తీసుకెళ్లడంలో సుమంత్ ప్రభాస్ ఫాలో అయ్యే విధానాలు చూసి యువ హీరోలు చాలామంది షాక్ అయ్యి, కుళ్లుకున్న సందర్భాలు కూడా ఉన్నాయంటే అంటే నమ్మక తప్పదు.
అయితే.. మరి గోదారి గట్టుపైన సినిమా ఫ్లాప్ అయ్యింది కాబట్టి సైలెంట్ అయ్యాడో లేక, సందీప్ రెడ్డి వంగా కంట్రోల్ చేస్తున్నాడో తెలియదు కానీ.. అతడి తాజా చిత్రం “రోమాంచకం” విషయంలో అస్సలు చప్పుడు చేయడం లేదు. సెప్టెంబర్ 3న సినిమా రిలీజ్, ఇప్పటివరకు టీజర్ & కొన్ని సాంగ్స్ రిలీజ్ చేశారు తప్పితే ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేయలేదు. వాటివల్ల ఉపయోగం ఉండదు అనేది సందీప్ రెడ్డి వంగా సిద్ధాంతం అనుకోండి.
ఇకపోతే.. సినిమాని ప్రమోట్ చేయడంలో తన క్రియేటివిటీ అంతా చూపించి, ఆడియన్స్ ను వెంటాడే సుమంత్ ప్రభాస్ “రోమాంచకం” విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండడం అనేది డిస్కషన్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే వంగా అతడ్ని సైలెంట్ గా ఉంచుతున్నాడా లేక రిలీజ్ కి వారం ముందు దుమ్ము లేపుతాడా? అనేది చూడాలి.




