సన్నీలియోన్ స్పెషల్… మహిళలకు మాత్రమే..!

Sunny Leone to launch make up Appదీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌ తన జీవితంలో తు.చ తప్పకుండా పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు బాలీవుడ్‌తో పాటు సౌత్‌ లోనూ తనకు దక్కిన ఆఫర్లను ఒడిసిపట్టుకుంటున్న ఈ సెక్స్ బాంబ్… సినిమాలతో పాటు వ్యాపారం వైపు కూడా దృష్టి సారిస్తోంది. ఇప్పటికే సుగంధ పరిమళాల వ్యాపారాన్ని నడిపిస్తున్న సన్నీ..ఇప్పుడు మహిళలు, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఓ ‘మేకప్ యాప్’ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపింది.

ఈ ఆలోచన తనకు చాలాకాలంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. మేకప్ విషయంలో సాధారణంగా మహిళలు చాలా కన్‌ఫ్యూజ్ అవుతుంటారని, ముఖానికి ఏ రంగు నప్పుతుంది, పెదాలకు ఏ లిప్‌స్టిక్ కలర్ వేసుకోవాలి… తదితర విషయాల్లో చాలా అయోమయానికి గురవుతుంటామని ఈ ‘తేరా ఇంతజార్’ నటి చెబుతోంది. ఇలాంటి అయోమయాలకు తన మేకప్ యాప్ చెక్ పెడుతుందని, ఇది మహిళలకు ఎంతగానో యూజ్ అవుతుందని ఆమె అంటోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories