అయ్యప్ప భక్తులు ఎంతగానో ఆసక్తి ఎదురుచూస్తున్న శబరిమలలోకి మహిళలను అనుమతించాలని చెప్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దేవుడు ఎక్కడున్నా ఒక్కటే… అలాంటపుడు ఇతర అయ్యప్ప ఆలయాలలోకి మహిళలను అనుమతిస్తూ, ఒక్క శబరిమలలో నియంత్రించడం రాజ్యాంగ విరుద్ధం అంటూ లాజిక్ తో కూడిన తీర్పును వెలువరించింది.
[m9ad]
ఓ వైపు మహిళలను దేవతలుగా కొలుస్తారు, మరోవైపు వారి హక్కులపై పరిమితులు విధించడం సమంజసం కాదని, స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉన్నాయని, మహిళల భక్తికి అయ్యప్పను దూరం చేయరాదని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఇందూ మల్హోత్రాలు అభిప్రాయపడ్డారు. ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై మహిళాలోకం స్వాగతిస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.
అయితే ఈ తీర్పు ఎప్పటినుండి అమలులోకి వస్తుంది? ఈ ఏడాది ప్రారంభం కానున్న మండల పూజ, జ్యోతి పూజా కార్యక్రమాలకు అనుమతి లభిస్తుందా? అంటే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన మరుక్షణం నుండే అమలులోకి వస్తుందన్న సమాచారం అందుతోంది. అయితే ఈ తీర్పు కాపీలు దేవస్థానం బోర్డుకు అధికారికంగా చేరాల్సి ఉంటుంది. నవంబర్ 15వ తేదీ నుండి మండల పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.



