మీరంతా ఓ అద్భుతాన్ని చూడబోతున్నారు!

Surendra Reddy on Sye Raa Narasimha Reddy movieఅవును… మీరంతా ఓ అద్భుతాన్ని చూడబోతున్నారు..! ఇది “సైరా నరసింహారెడ్డి” గురించి టీజర్ విడుదలైన సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు దర్శకుడు సురేందర్ రెడ్డి, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, కధారచయితలు పరుచూరి బ్రదర్స్ క్లుప్తంగా చేసిన వ్యాఖ్యలు. పన్నెండేళ్ళ నుండి సాగుతున్న కధ చివరికి తెరరూపం సిద్ధించుకోవడం ఆనందంగా ఉందంటూ పరుచూరి బ్రదర్స్ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

ADVERTISEMENT

[m9ad]

మీరు ఎన్ని అంచనాలైనా పెట్టుకురండి… అంతకుమించిన రీతిలో ఈ సినిమా ఉంటుంది… అంటూ దర్శకుడు సురేందర్ రెడ్డి మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచారు. చిరంజీవి కెరీర్ లో రెండు మైలురాళ్ళ సినిమాలైన ‘ఖైదీ నంబర్ 150, సైరా’లకు డైలాగ్స్ అందించే భాగ్యం తనకు దక్కిందని, ఈ అవకాశాన్ని తమకు కల్పించినందుకు చిరు, చెర్రీలకు జీవితాంతం రుణపడి ఉంటానని బుర్రా సాయిమాధవ్ అన్నారు.

ఈ సినిమా నాన్న గారి డ్రీం అని, పన్నెండు సంవత్సరాల నుండి అనేక వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ సినిమా ఇప్పుడు కార్యరూపం సిద్ధించుకున్నదంటే అది పరుచూరి బ్రదర్స్ సంకల్పమేనని, దర్శకుడు సురేందర్ రెడ్డి అత్యద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నానని, ఈ సినిమాలో భాగస్వామ్యులు అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్మాత రామ్ చరణ్ తనదైన శైలిలో ప్రసంగించారు.

ADVERTISEMENT
Latest Stories