తమ్ముడు ఓటీటీలో… తనయుడు ధియేటర్లోనా..?

Suresh Babu yet to plan Virata Parvam Releaseఒక ప్రొడ్యూసర్ గా దగ్గుపాటి సురేష్ బాబుకున్న ఇమేజ్ సినీ వర్గాలకు సుపరిచితమే. బడ్జెట్ తో సంబంధం లేకుండా కంటెంట్ + క్రేజ్ ను బట్టి ఎంత ఖర్చు పెట్టాలో, తిరిగి ఎంత రాబడి వస్తుందో కరెక్ట్ గా అంచనా వేయడంలో సురేష్ బాబు దిట్ట అన్నది మార్కెట్ వర్గాలలో కూడా బలంగా వినిపించే మాటలు.

అలాంటి టాప్ ప్రొడ్యూసర్ సినిమాలు ప్రస్తుతం ఓటీటీ బాట పడుతున్నాయి. తమ్ముడు విక్టరీ వెంకటేష్ తో తీసిన “నారప్ప”తో పాటు మరో 9 రోజుల్లో “దృశ్యం 2” కూడా ప్రైమ్ లో ప్రత్యక్షం కానుంది. దీంతో సురేష్ బాబు తన తనయుడితో తీసిన “విరాట పర్వం” ఓటీటీలో రిలీజ్ చేస్తారా? లేక ధియేటర్ వరకు వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT

ఈ సినిమాలో నక్సలైట్ గా నటించిన రానాకు జంటగా సాయి పల్లవి కనిపించనుండగా, ప్రియమణి మరో ప్రధాన పాత్రలో తళుక్కుమననుంది. వేణు ఉడుగుల దర్శకత్వం ఈ సినిమా టీజర్ మార్చిలో విడుదలై ప్రేక్షకుల ఆసక్తిని చూరగొంది. ఇప్పటికే పూర్తయిన ఈ సినిమా రిలీజ్ పై అతి త్వరలో ఓ ప్రకటన రానుందని సినీ వర్గాల సమాచారం.

ADVERTISEMENT
Latest Stories