వైసీపీకి వర్మ కౌంటర్..!

svsn-varma-counter-to-ysrcp

పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న వర్మ పొత్తు ధర్మానికి కట్టుబడి తానూ పోటీ నుంచి తప్పుకుని తన పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసి పవన్ గెలుపు కోసం కాదు మెజారిటీ కోసం కష్టపడతాం అంటూ అటు టీడీపీ అధినేత బాబు కి ఇటు జనసైనికులకు హామీ ఇచ్చి పవన్ కు కొండంత అండగా పని చేస్తున్న వర్మ పై బ్లూ మీడియా, వైసీపీ సోషల్ మీడియా విషప్రచారం మొదలుపెట్టింది.

పిఠాపురంలో తనకు సీటు దక్కకపోవడంతో నిరాశ చెందిన వర్మ టీడీపీ పార్టీ సైకిల్ దిగి వైసీపీ ఫ్యాన్ కిందకు వస్తున్నారంటూ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తుంది. దీనితో అటు టీడీపీ శ్రేణులలోను, ఇటు జనసైనికులలోను అనుమానాలను సృష్టించి ఓటు బదిలీ ప్రక్రియ సజావుగా జరగకూడదని వైసీపీ వ్యూహం. అయితే ఈ వైసీపీ సోషల్ మీడియా వ్యూహాలను తిప్పికొట్టారు వర్మ.

ADVERTISEMENT

తానూ వైసీపీ పార్టీలో చేరబోతున్నాను అంటూ వస్తున్న వార్తల పై తనదైన స్టైల్ లో రిప్లయ్ ఇచ్చారు వర్మ. ఇక్కడ వైసీపీ ఓటమి ఖాయమని తేలడంతో ఇక దిక్కుతోచక వైసీపీ ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తుందంటూ మండిపడ్డారు. 2014 నుంచి కూడా వైసీపీ తానూ వైసీపీలో చేరుతానని తన పై ఎన్నో ఆశలు పెట్టుకుందని, తనకు ఆ పరిస్థితి ఎప్పటికి రాదని వైసీపీకి తేల్చి చెప్పారు వర్మ.

తానూ చంద్రబాబు నాయకత్వంలో పని చేయడానికి తానూ తన సీటుని సైతం సంతోషంగా త్యాగం చేసానని, ఆ త్యాగానికి కట్టుబడే ఇచ్చిన మాట ప్రకారం పవన్ ను బారి మెజారిటీతో గెలిపించుకోవడానికి శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నాని పిఠాపురం లో పవన్ గెలుపు ఆపడం వైసీపీ కి అసాధ్యమంటూ బదులిచ్చారు. ఈరోజు పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కుతోడుగా వర్మ కూడా రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు.

ADVERTISEMENT
Latest Stories