నిన్నటి మేడ్చల్ సభలో ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా సహా తాము ప్రకటించిన అన్ని హామీలను అమలు చేస్తామని ప్రకటించిన యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని టార్గెట్ చేసింది తెరాస పార్టీ. సోనియాగాంధీ వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని మంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. తెలంగాణలో సభ పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు హామీలు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టమని చెప్పారు. ఇక్కడి పరిశ్రమలను ఆంధ్రకు తరలించుకుపోతారా అని ప్రశ్నించారు.
[m9ad]
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు తమ సంపూర్ణ మద్దతు అని పార్లమెంట్ లో ప్రకటించిన తెరాస ఆ తరువాతి కాలంలో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడానికి హరీష్ తో ఈ విషయంపై విమర్శలు చేయిస్తూ ఉంది. మేడ్చల్ సభలో సోనియా మాటలు చూస్తుంటే స్క్రిప్టు చంద్రబాబు ఇచ్చినట్లుగా అనుమానంగా ఉందన్నారు. ఒకపక్క హరీష్ రావుతో ఆంధ్రకు వ్యతిరేకంగా మాట్లాడిస్తూ కేటీఆర్ తో సెట్లర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుంది అధికార తెరాస పార్టీ.
ఏపీ ప్రత్యేక హోదాకు తాము వ్యతిరేకమని కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ చెప్పారు. ఆలా చెబితే సెట్లర్లఓట్లు పోతాయని భయం. అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని చూసి ఏడుపొస్తోందని అనడం సరికాదన్నారు హరీష్. తెలంగాణలో తాము అధికారంలో లేనందుకు, రానందుకు సోనియాకు దుఃఖ పడుతున్నట్లు తనకు అనిపిస్తోందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఇప్పుడు సోనియా గాంధీని అన్ని మాటలు అంటున్న హరీష్ తెలంగాణకు దేవత అని కుటుంబమంతా ఢిల్లీ వెళ్లి ఫోటో తీయించుకుని వచ్చిన సంగతి మర్చిపోయారేమో.



