కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుని తెలంగాణకు నష్టం చేయాలని చూస్తే.. చంద్రబాబు ఖబడ్దార్ అని ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. “కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు అమరావతిలో పడ్డాడు. బాబు ఇంకా పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తులో నీ సంగతి చూస్తాం. మా వద్ద ఉన్న రికార్డులు ముందుముందు బయటపెడతాం” అని ఆయన హెచ్చరించారు.
[m9ad]
కాంగ్రెస్‌కు టికెట్లు, నోట్ల కట్టలు, మాట్లాడాల్సిన స్క్రిప్ట్.. అన్నీ అమరావతి నుండే వస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ దెబ్బకొడితే కాంగ్రెస్, టీడీపీ మైండ్ బ్లాంక్ అవుతుందని హెచ్చరించారు. హరీష్ రావు మాట్లాడేది అంతా బానే ఉంది. ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చంద్రబాబు సంగతి చూడలేకపోయింది?
ఓటుకు నోటు కేసు ఛార్జ్ షీట్లో కనీసం చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేకపోయారు? పట్టుమని పదిహేను సీట్లలో పోటీలో ఉందని పార్టీని, కేసీఆర్ చెప్పినట్టు చేసిన 15 సర్వేలలో 0.25% మించి ఓట్లు రాని పార్టీని చూసి అధికార పార్టీ వారు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? చంద్రబాబును బూచిగా చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నం ఇదని కాంగ్రెస్ వారు ఆరోపిస్తున్నారు.



