బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మన్మధుడు నాగార్జున కుటుంబం, విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు తరపున సతీమణి నమ్రత శిర్కొదర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు ఇతర టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న జీఎంఆర్ గ్రౌండ్స్ లో కలుసుకున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి మనవడు కేశవ్ – వీణ వివాహం నేపధ్యంలో… ఈ వివాహ వేడుకకు సుబ్బరామిరెడ్డి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. ప్రముఖ సెలబ్రిటీలతో పాటు గవర్నర్ నరసింహన్ దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితరులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
Win Rs.1000 Paytm for closest guess of @NameisNani 's #NenuLocal USA Premiere Collections ends by Thur 7pm IST#M9NewsWin1000 3rd contest pic.twitter.com/PcsmdS09lQ
— M9News (@M9News) 31 January 2017



