తమ్మారెడ్డి చెబితే చిరంజీవి వింటారా..?

Tammareddy Bharadwaja Chiranjeeviరీసెంట్ గా విడుదలైన చిరంజీవి భోళా శంకర్ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తరవాత మెహర్ రమేష్ తో పాటు చిరంజీవి పై కూడా ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా చిరంజీవి సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లకు సినిమా తప్ప మరో ఆలోచన ఉండేది కాదని… ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నా దాన్ని వ్యాపారంగా చూసేవాళ్ళు ఎక్కువైపోయారు అంటూ కామెంట్ చేశారు.

కథ చెప్పమంటే అప్పుడు సూటిగా చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు కట్ చేస్తే అంటూ ఎలివేషన్స్ ఇస్తున్నారని అన్నాడు. సినిమాలో ప్రేక్షకులకు పనికొచ్చే అంశం ఉండాలి …అది నాచురల్ గా ఉండాలి ఇది పక్కన పెట్టి ఏదో చేస్తే సినిమాలు ఆడవన్నారు. అంతే కాకుండా చిరంజీవి చేసిన రుద్రవీణ, శుభలేఖ, స్వయం కృషి సినిమాలకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కిందని… అమీర్ ఖాన్ దంగల్ లాంటి సినిమా చిరంజీవి చేసినా చూస్తారన్నారు.

ADVERTISEMENT

భోళా శంకర్…గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు చేసి నిరాశ చెందటం కంటే నేచురల్ సినిమాలు చేస్తే బెటర్ అని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని చిరంజీవితో చెబుదామని ప్రయత్నించా కానీ ఎందుకో కుదరలేదని అన్నారు. ఒకప్పటి సినిమాల్లో చిరంజీవిని చూస్తే మన ఇంట్లో మనిషిలా కనబడేవారు..మళ్లీ ఆ చిరంజీవి కనిపిస్తే చూడాలని ఉంది అంటూ కామెంట్ చేశాడు. అయితే ఇప్పుడు తమ్మారెడ్డి చెబితే చిరు వింటాడా….? అన్నది ప్రశ్నగా మారింది.

రీమేక్ సినిమాలు వద్దు బాబోయ్ అంటూ అభిమానులు ముందు నుండి చిరును కోరుతున్నారు. చిరు రీమేక్ సినిమాలపై తరచూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా చిరు తగ్గటం లేదు. వరుస పెట్టి మరీ రీమేక్ కు చేస్తున్నాడు. ఇక తమ్మారెడ్డి విషయానికి వస్తే ఒకప్పుడు నిర్మాతగా క్రేజ్ సంపాదించుకున్న ఆయన ఇప్పుడు తరచూ యుట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పింది నిజమే అయినా పట్టించుకునే వాళ్ళు లేరు. మరోవైపు గతంలో తమారెడ్డి చిరు పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది తెలిసిందే. దాంతో నాగబాబు రంగంలోకి దిగి రచ్చ చేశారు. మరి ఇప్పుడు తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories