TDP BRS

ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస). అయితే పార్టీ ఆవిర్భవించిన లక్ష్యం నెరవేరింది, పార్టీ పదేళ్ల పాటు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇక వచ్చిన కార్యక్రమం పూర్తయ్యింది తనువు చాలించి కొత్త అవతారం ఎత్తడమే మన తక్షణ కర్తవ్యం అని భావించిన కేసీఆర్ తెరాస ను భారతీయ రాష్ట్ర సమతిగా రూపాంతరం చేసారు. అయితే ఇన్నాళ్లుగా పార్టీ పేరులో తెలంగాణ ఉండడంతో కేవలం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితమైన తెరాస తన పరిధిని విస్తరించడానికి పార్టీ పేరులో ఉన్న తెలంగాణ అనే పదాన్ని తొలగించింది.

Also Read – చంద్రబాబు ప్రభుత్వంలో వైసీపి కోవర్టులు… ఏరేదెప్పుడు?

తెరాస ను బిఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలలో తన కారు స్ట్రీరింగ్ తిప్పాలని ఆశపడ్డ కేసీఆర్ దేశ రాజకీయాలకు దగ్గరవ్వలేదు కానీ రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యారు. తెరాసను బిఆర్ఎస్ గా మార్చిన మరుక్షణమే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను తిరస్కరించారు. అయితే రాష్ట్రాలుగా రెండుగా విడిపోయినా భాషాపరంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు జాతి కిందకే వస్తారు.

తెలుగు వాడి ఆత్మగౌరం అనే నినాదంతో ఆవిర్భవించిన పార్టీ తెలుగు దేశం పార్టీ. తెలుగు వాడు ఎక్కడ ఉన్న అక్కడ పసుపు జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. ఒకరకంగా తెలుగు వారికీ విదేశీ వీసాల గేట్లు తెరిచింది టీడీపీ ప్రభుత్వంలో బాబు హయాంలోనే. అప్పటి వరకు సామాన్య మధ్యతరగతి యువతకి విదేశాలకు వెళ్లడం సాధ్యమేనా అనుకున్న ఊహ నుండి దాన్ని నిజం చేసి చూపించారు.

Also Read – ఏపీకి పరిశ్రమలు రావాలంటే ముందు….

అయితే ఇప్పుడీ రెండు పార్టీల మధ్య మరోసారి రాజకీయ చిచ్చు రాచుకుంది. తెలంగాణ రాజకీయాలలో ఆంధ్రోళ్ల పెత్తనం అంటూ ఆరు నెలల కిందట కాంగ్రెస్ దెబ్బకు షెడ్డుకెళ్లిన కారును రోడ్ల మీదకు తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది బిఆర్ఎస్. అయితే పార్టీ పేరు నుంచే తెలంగాను తొలగించిన మీరా టీడీపీని విమర్శించేది అంటూ టీడీపీ మద్దతుదారులు బిఆర్ఎస్ కు కౌంటర్ ఇస్తున్నారు.

అయితే పరిస్థితుల ప్రభావమో, నాయకత్వ లోపమో కానీ తెలంగాణలో రాష్ట్ర విభజన తరువాత టీడీపీ పార్టీ నిశ్శబ్దమయ్యింది. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు పూర్తిగా ఏపీ పైనే ద్రుష్టి పెట్టడంతో, పార్టీని బలంగా ముందుకు తీసుకు వెళ్లే నాయకులు లేకపోవడంతో, గతంలో బిఆర్ఎస్ వ్యూహాలన్నీ పారాయి. అయితే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీనే తన అస్తిత్వం నిలబెట్టుకోవడానికి పోరాడుతుంది.

Also Read – నువ్వొస్తానంటే మేమొద్దంటామా.?

ఇటువంటి సమయంలో తెలంగాణలో ఏర్పడిన రాజకీయ స్పేస్ ను టి. టీడీపీ పూర్తి చెయ్యాలని చూస్తుంది. దీనితో బిఆర్ఎస్ కు మళ్ళీ తెలంగాణ వాదన గుర్తుకొచ్చింది. తెలంగాణలో బాబు పైన టీడీపీ పార్టీ పైన తెలంగాణ ప్రజలకు నమ్మకం తగ్గలేదు అనేది బిఆర్ఎస్ నాయకుల స్వరంలో వినిపిస్తుంది.

ఒక్క ఓటమితో ఇప్పటికే బిఆర్ఎస్ దాదాపుగా పాతాళానికి వెళ్ళింది. టి. టీడీపీ ని మళ్ళీ పటిష్టం చేసి తెలంగాణలో కూడా పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి బాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ వార్తతో ఉలిక్కిపడ్డ తెలంగాణ వాదులుగా చెప్పుకునే బిఆర్ఎస్ నాయకులు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నారు.

అసలు పార్టీ పేరులోనే తెలంగాణ అన్న పదాన్ని తొలగించిన బిఆర్ఎస్ కు తెలుగు దేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు ఉంటుందా.? తెలుగు దేశం పార్టీ పేరే ‘తెలుగు ‘జాతితో ముడిపడి ఉంటుంది. తెలంగాణ పేరుతో పుట్టిన పార్టీ తెలంగాణ అనే పేరు తొలగించగానే దాని కథ ముగిసింది. అలాగే తెలుగు దేశం నుండి తెలుగు అనే పదాన్ని తొలగించిన నాడే తెలంగాణలో టీడీపీ కథ ముగుస్తుంది.

అప్పటి వరకు అంటే తెలుగు జాతి ఉన్నంత కాలం టీడీపీ వారి ఉన్నతికి పని చేస్తూనే ఉంటుందని, అది ప్రభుత్వమా? ప్రతిపక్షమా? అనేది ప్రజలు ఇచ్చిన తీర్పుని బట్టి ఆధార ఉంటుందంటున్నారు టీడీపీ అభిమానులు. దీనితో పేరుతో పుట్టిన పార్టీలు పేరుతోనే అంతమవుతాయి అనిపిస్తుంది.