టీడీపీ ‘ముందస్తు’ ప్రణాళికలో ‘వెనుక’పడిందా..?

TDP

అపర చాణక్యుడు, రాజకీయ దురంధరుడు, విజనరీ లీడర్ అంటూ గతంలో ప్రత్యర్థుల చేత కూడా ప్రశంసలు అందుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి రాజకీయ క్రీడలో కాస్త వెనుకపడ్డారా అంటే పడ్డారేమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

అప్పట్లో ప్రత్యర్థులు వేసే ఎత్తులకు అప్పటికప్పుడు పై ఎత్తులు వేస్తూ వారి వ్యూహాలకు చెక్ పెడుతూ ఎప్పుడు రెండడుగులు ముందుండే బాబు ఇప్పుడు వెనకపడుతున్నారు. 2019 లో ఒక రకంగా టీడీపీ ఓటమికి కారణం ఇదే అని చెప్పక తప్పదు. 2019 లో కూడా వైసీపీ వ్యూహంలో చిక్కుకున్న చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వం పై పోరాటాలు చేసి బీజేపీ కి శత్రువుగా మారిపోయారు.

ADVERTISEMENT

అలాగే ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జగన్ పై జరిగిన కోడికత్తి దాడి, వివేకా హత్య కి కారణం బాబు అంటూ టీడీపీ పై వేసిన బురదను వైసీపీ పై తిప్పికొట్టలేక పోయారు. అలాగే తన పై జగన్ వేసిన నిందను తుడుచుకోలేకపోయారు. జగన్, బీజేపీ, బిఆర్ఎస్ తో తెర వెనుక స్నేహబంధాన్ని కొనసాగిస్తూ టీడీపీ పై నిందలు వేస్తున్నా వాటికీ కౌంటర్లు ఇవ్వలేకపోయారు.

పవన్, షర్మిల, సునీత, పురందరేశ్వరి వంటి నేతల విమర్శల వెనుక బాబే ఉన్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్టవేయలేకపోతున్నారు. అలాగే బాబు పై వ్యక్తిగత దాడి చేస్తూ టీడీపీ క్యాడర్ ను రెచ్చగొడుతున్న వైకాపా నాయకులను నియంత్రించ లేకపోతున్నారు. ఇలా వైసీపీ ఆడుతున్న పద్మవ్యూహంలో చిక్కుకుని ప్రతిపక్షం అనే ఓటమితో వెనుతిరిగారు.

ఇప్పుడు 2024 లో కూడా ఇదే తరహా ఎన్నికల ప్రచారంతో మరోసారి వెనుకడుగు వేస్తున్నారా అనేది టీడీపీ ఒకసారి పునరాలోచించుకోవాలి. జగన్ తన ఎన్నికల ప్రచారంలో తానూ నొక్కిన బటన్ల గురించి చెప్పుకుంటూ ప్రజలను ఓట్లడుగుతుంటే, టీడీపీ కూటమి మాత్రం తాము అధికారంలోకి వస్తే ఇచ్చే హామీల అమలు గురించి వివరిస్తూ ముందుకెళ్తున్నారు. తాము చేయబోతున్నది చెపుతున్న నేతలు గత పాలక పక్షం చేయలేనివి కూడా ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాలి.

నొక్కిన బటన్లు కాదు చేసిన అప్పులు గురించి, వాటి కోసం పెట్టిన తాకట్లు గురించి ప్రజలకు వివరించాలి. అలాగే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో విధుల నుంచి తప్పించిన వాలంటీర్లను, పెన్షన్ల కోసం రోడ్ల మీదకు వచ్చి వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వృద్ధుల చావులను కూడా టీడీపీ ఖాతాలో వేసి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసిన వైసీపీ అందుకు అనుగుణంగా తన ప్రణాళికను అమలు చేయగలిగింది.

గతంలో అయితే బాబు జగన్ కు ఈ ఆలోచన వస్తది అని ముందుగానే ఉహించి అందుకు తగ్గ అస్త్రాలను అందుబాటులో ఉంచుకునేవారు. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న బాబు అప్పట్లో చేతులు కాలకుండా జాగ్రత పడేవారు. అలాగే ఈ నెల పిన్షన్ల పంచాయితీ ఒకకొలిక్కి వచ్చిందిలే అనే నిర్లక్ష్యంతో ఉన్న టీడీపీ మరో పది రోజులలో ఈ సమస్య రాష్ట్ర ప్రజల ముంగిట వాలనుంది అనే విషయాన్ని విస్మరిస్తున్నారు.

మళ్ళీ ఒకటవ తేదీ వచ్చే లోపే బాబు, పవన్ లు వైసీపీ ఆడుతున్న ఈ పిన్షన్ రాజకీయాన్ని వైసీపీ కంటే ముందుగానే ప్రజల వద్దకు తీసుకువెళ్లి దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అనేలా ప్రజలను ఒప్పించగలగాలి. అలాకాకుంటే వైసీపీ మరోసారి కొంతమంది వృద్ధుల ప్రాణాలతో తన పార్టీకి అధికారం అనే ఊపిరిని అందించే అవకాశం ఉంది. పెన్షన్లు ఆపి, వాలంటీర్లను కట్టడి చేసి, సంక్షేమ పతకాలు ఇళ్లకు పంపణీ చేయకుండా చేసి ఆ నేరం మొత్తాన్ని టీడీపీ మీద రుద్ది వైసీపీ రాజకీయ లబ్ది పొందడానికి మరో పది రోజుల సమయమే మిగిలి ఉంది.

దీనిని టీడీపీ సమర్థవంతంగా తిప్పికొట్టలేక పోతే సంక్షేమ పతకాల లబ్ధిదారుల ఓట్లను కూటమి పార్టీలు చేచేతుల జారవిడిచుకున్నవారవుతారు. అలాగే జగన్ పైన జరిగిన రాయి దాడిలో కూడా టీడీపీ కి ఎటువంటి సంబంధం లేదు అనేది ప్రజలలోకి తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో ఆ దాడుల వెనుక దాగిన రహస్యాలను ప్రజలకు వివరించడం కూడా అంతే కీలకం.

వైసీపీ వ్యూహాలను ముందుగానే పసి గట్టి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ తమ పార్టీ క్యాడర్ను సమన్వయ పరచుకుంటూ తనకున్న 40 ఎల్లా రాజకీయ అనుభవాన్ని, నాలుగున్నరేళ్లుగా తానూ ఎదుర్కుంటున్న అవమానాలను రంగరించి కూటమిని విజయం దిశగా అడుగులు వేయించాల్సిన బాధ్యత, బరువు రెండు బాబువే అనేది గుర్తించాలి.

ADVERTISEMENT
Latest Stories